Harish Rao | క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. ఆలస్యం చేస్తేనే ప్రమాదం
Harish Rao | సిద్దిపేట ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపనని, మీ ఆరోగ్యం కంటే నాకు ఏదీ ఎక్కువకాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్‌కు చెందిన సింధు క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈనెల 29, 30న రెండు రోజులపాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని మాజీమంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
సిద్దిపేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు
సిద్దిపేట ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన
40 ఏళ్లు దాటిన మహిళలు విధిగా
స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలి
క్యాన్సర్ రోగుల బాధలు నాకు తెలుసు
మాజీమంత్రి హరీశ్ రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : సిద్దిపేట ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపనని, మీ ఆరోగ్యం కంటే నాకు ఏదీ ఎక్కువకాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్‌కు చెందిన సింధు క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈనెల 29, 30న రెండు రోజులపాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని మాజీమంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ మేరకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకునేందుకు పట్టణంలోని పలు వార్డుల నుంచి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చాలామంది మహిళలు మూడు, నాలుగవ స్టేజిలో వ్యాధి ముదిరిన దశలో వైద్య సహాయం కోసం తన దగ్గరికి వచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేస్తేనే ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లి వ్యయప్రయాసలు పడకుండా ఉండేందుకు సింధు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పార్థసారథిని సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని కోరడంతో, రెండు రోజులపాటు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించేందుకు అత్యాధునిక పరికరాలతో వైద్యులు సిబ్బంది వచ్చారని తెలిపారు. రెండు రోజులపాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు 40 ఏళ్ళు దాటిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ప్రతి ఏడాది 50 వేల క్యాన్సర్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది 50 వేల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని అందుకు స్క్రీనింగ్ చేసుకోకపోవడమే ప్రధాన కారణమన్నారు. స్క్రీనింగ్ పరీక్షల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారికి ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్య చికిత్సలు అందించేందుకు సింధు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పేద ప్రజలకు వైద్య చికిత్సలు అందించేందుకే సింధు క్యాన్సర్ ఆసుపత్రిని డాక్టర్ పార్థసారథి నెలకొల్పారని చెప్పారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి తరహాలోనే సింధు క్యాన్సర్ ఆసుపత్రి స్క్రీనింగ్ సేవలను కూడా వినియోగించుకునేందుకు, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద స్క్రీనింగ్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే అసలైన మందు అదేనన్నారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం రూ. 2.50 కోట్ల విలువ గల అత్యాధునిక పరికరాలతో మొబైల్ వాహనంతో పాటు, పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు, సిబ్బంది వచ్చారని ఆ వాహనంలో మెమోగ్రాఫ్, ఎక్స్‌రే, ఎగ్జామినేషన్ రూమ్, శాంపిల్ కలెక్షన్ తీసుకుంటారని వివరించారు.

నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
సిద్దిపేటలో పేద ప్రజలకు వైద్యం అందించేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశానని, దాదాపు 95 శాతం పూర్తి అయిన ఆసుపత్రికి ఐదు శాతం కూడా నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గత మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి పడకల ఆస్పత్రి కోసం ఐదు శాతం నిధులు కూడా కేటాయించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని తెలిపారు. సిద్దిపేటలో హోమియోపతి, యునాని, ఆయుర్వేద ఆసుపత్రులను తీసుకువచ్చానని అందుకు అన్ని సౌకర్యాలను కల్పించామని చెప్పారు. ఆ ఆస్పత్రులకు కూడా వైద్యులను నియమించడంలో మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు. వెంటనే వెయ్యి పడకల ఆసుపత్రికి నిధులు కేటాయించడంతోపాటు హోమియోపతి, యునాని, ఆయుర్వేద ఆసుపత్రులకు వైద్యులను, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింధు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేష్, వైద్యులు త్రిష, వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..
- ●Rahul Gandhi | లోక్సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ
- ●Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్వరల్డ్..!
- ●Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్టాప్లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..
- ●RS Praveen Kumar | రూ. 1100 కోట్ల స్కాం బయటపెట్టినందుకే 'పెద్ది'కి వేధింపులు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Avor EX | మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఏఐ ఫీచర్లతో లాంచ్.. రూ.799కే బుకింగ్..

Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..

Rahul Gandhi | లోక్సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ

Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్వరల్డ్..!

Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్టాప్లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..




