త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్‌ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్‌..!

Manushi Chhillar | ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌కు మరో అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ హ్యాండోవర్ వేడుకలో ఆమె ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్న ఏకైక భారతీయ నటిగా మానుషి నిలవనుంది.

P

Entertainment | Published On Jul 29, 2026, 3.01 pm IST

Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్‌ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్‌..!
Advertisement

Manushi Chhillar | ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌కు మరో అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ హ్యాండోవర్ వేడుకలో ఆమె ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్న ఏకైక భారతీయ నటిగా మానుషి నిలవనుంది. ఆగస్టు 2న గ్లాస్గోలోని ఓవీఓ హైడ్రో వేదికగా ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలో భాగంగా నిర్వహించే హ్యాండోవర్ కార్యక్రమంలో సంగీతం, సంస్కృతి, వినోద ప్రదర్శనలతో గ్లాస్గో 2026 నుంచి అహ్మదాబాద్ 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు బాధ్యతల బదిలీని ప్రతిబింబించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ దేశాల కళాకారులు పాల్గొననుండగా, భారతదేశం తరఫున మానుషి చిల్లర్ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆమె పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మానుషి, ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్‌గా ఉన్న సమయంలో ఆరోగ్యం, మహిళా సాధికారత, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. అనంతరం అంతర్జాతీయ ఫ్యాషన్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్లోబల్ ఈవెంట్లలోనూ భారత ప్రతినిధిగా హాజరవుతూ వస్తోంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన మానుషి 2022లో విడుదలైన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో బాలీవుడ్‌లో కథానాయికగా అరంగేట్రం చేసింది. అనంతరం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియాన్ ఛోటే మియాన్ తదితర చిత్రాల్లో నటించింది. తెలుగులో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో అహానా పాత్రలో కనిపించింది. ఇటీవల ప్రముఖ గాయకుడు హిమేశ్ రేషమియా ఆలపించిన ‘షరాబ్’ మ్యూజిక్ వీడియోలోనూ సందడి చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ హ్యాండోవర్ వేడుకలో మానుషి ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న ఆమె ప్రదర్శన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

Advertisement
Advertisement