త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | సెప్టెంబ‌ర్‌లో తిరుమ‌ల వెళ్లాల‌నుకుంటున్నారా..? ఆర్జిత సేవ‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల రిలీజ్ ఎప్పుడో తెలుసా?

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు దేవస్థానం బోర్డు (టీటీడీ) శుభ‌వార్త తెలిపింది. జూన్ 18 నుంచి జూన్ 24 మధ్య వివిధ సేవా, ప్ర‌త్యేక ప్ర‌వేశ దర్శనం టికెట్లు, వ‌స‌తి గ‌దుల కోటా విడుద‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది.

P

Devotional | Published On Jun 13, 2026, 7.58 pm IST

TTD | సెప్టెంబ‌ర్‌లో తిరుమ‌ల వెళ్లాల‌నుకుంటున్నారా..? ఆర్జిత సేవ‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Advertisement

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు దేవస్థానం బోర్డు (టీటీడీ) శుభ‌వార్త తెలిపింది. జూన్ 18 నుంచి జూన్ 24 మధ్య వివిధ సేవా, ప్ర‌త్యేక ప్ర‌వేశ దర్శనం టికెట్లు, వ‌స‌తి గ‌దుల కోటా విడుద‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. జూన్ 18 ఉదయం 10 గంటల నుంచి జూన్ 20 ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రధాన ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించనుంది. లక్కీ డిప్ విధానంలో టికెట్లు పొందిన భ‌క్తులు జూన్ 22 మధ్యాహ్నం 12 గంటల్లోగా డ‌బ్బులు చెల్లిస్తే టికెట్లు ఖ‌రార‌వుతాయి. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు విడుదల కానున్నాయి.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి రానున్నాయి. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, అలాగే శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన వృద్ధుల కోటా టికెట్ల కోటాను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. జూన్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన (Special Entry Darshan) టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో భక్తుల వసతి కోసం గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల‌వుతాయ‌ని బోర్డు తెలిపింది. ఈ క్ర‌మంలో టికెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ల‌ను బుక్ చేసుకొని స‌హ‌క‌రించాల‌ని కోరింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించారు.

Advertisement
Advertisement