Rahul Gandhi | వైఫల్యం కాదు.. యువత భవిష్యత్తుపై జరిగిన నేరం.. నీట్ రద్దుపై రాహుల్ గాంధీ
Rahul Gandhi | ప్రధాని చెబుతున్న 'అమృత్ కాల్'.. దేశానికి ఒక విషయుగంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. నీట్ 2026 పరీక్ష రద్దుపై రాహుల్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
- నాలుగుసార్లు నీట్ పేపర్ లీకైంది..
- మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది
- 'అమృత్ కాల్'.. దేశానికి ఒక విషయుగంగా మారింది
- 10 ఏళ్లలోనే 89 సార్లు పేపర్లు లీకులు
- ఇది అధికారంలో ఉన్నవారిపనే
Rahul Gandhi | వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026 (NEET UG 2026)కు సంబంధించి పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. దీంతో 22 లక్షల మంది విద్యార్థుల కష్టం వృథా అయ్యిందంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.
ప్రధాని చెబుతున్న 'అమృత్ కాల్'.. దేశానికి ఒక విషయుగంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. నీట్ 2026 పరీక్ష రద్దుపై రాహుల్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. "నీట్ 2026 పరీక్ష రద్దైంది. ఈ అవినీతి బీజేపీ పాలనలో 22 లక్షల మందికిపైగా విద్యార్థుల కష్టం, త్యాగాలు, కలలు ఛిన్నాభిన్నమయ్యాయి. కొందరు తండ్రులు అప్పులు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లులు తమ నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది పిల్లలు ఈ పరీక్ష కోసం రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. కానీ, వీటన్నింటికీ ప్రతిఫలంగా వారికి దక్కింది ప్రశ్నపత్రాల లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యావ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి మాత్రమే.
ఇది కేవలం ఒక వైఫల్యం మాత్రమేకాదు.. యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ప్రతిసారీ పేపర్ మాఫియా ఏ శిక్షా లేకుండా తప్పించుకుంటుంటే.. నిజాయితీ గల విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ అదే మానసిక ఒత్తిడిని, ఆర్థిక భారాన్ని, అనిశ్చితిని భరించాల్సి వస్తోంది. ఒక వ్యక్తి తలరాతను వారి కష్టంతో కాకుండా.. డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక విద్యకు అర్థం ఏముంటుంది..? ప్రధాని చెబుతున్న 'అమృత్ కాల్'.. దేశానికి ఒక విషయుగంగా మారింది" అంటూ రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు.
NEET 2026 की परीक्षा रद्द हो गयी।
22 लाख से ज़्यादा छात्रों की मेहनत, त्याग और सपनों को इस भ्रष्ट भाजपाई व्यवस्था ने कुचल दिया।
किसी पिता ने कर्ज़ लिया,
किसी माँ ने गहने बेचे,
लाखों बच्चों ने रात-रात भर जागकर पढ़ाई की,और बदले में मिला, पेपर लीक, सरकारी लापरवाही और शिक्षा में…
— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026
నాలుగుసార్లు నీట్ పేపర్ లీక్..
గత 10 ఏళ్లలోనే ఇప్పటి వరకూ 89 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు నీట్ పేపర్ లీకైనట్లు తెలిపింది. "నీట్ పేపర్ లీక్ అయ్యింది.. పరీక్ష రద్దైంది. ఈ పరీక్ష కోసం విద్యార్థులు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదువుతారు. కానీ ప్రశ్నపత్రం లీక్ అయ్యి వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ లీకులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటోంది. నిజం ఏమిటంటే.. అధికారంలో ఉన్న వారే ఈ పేపర్ లీకేజీల్లో భాగస్వాములుగా ఉన్నారు. మన దేశంలోని విద్యావ్యవస్థలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. గత 10 ఏళ్లలో ఇప్పటి వరకూ 89 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. ఇక దీనిని ఎంతమాత్రం సహించేది లేదు" అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది.
Also Read..
కపూర్ ఫ్యామిలీ రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. మహాభారతాన్ని మించిపోయింది : సుప్రీంకోర్టు
సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
ప్రధాని పొదుపు సూచనల వేళ.. భారీ కాన్వాయ్‌తో వెళ్లిన బీజేపీ నేత
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






