త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar | నేడు బారామ‌తిలో అజిత్ ప‌వార్ అంత్య‌క్రియ‌లు.. పాల్గొన‌నున్న మోదీ, అమిత్ షా

Ajit Pawar | అజిత్ ప‌వార్ (Ajit Pawar) అంత్య‌క్రియ‌ల‌ను (Last Rites) బారామ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం అజిత్ భౌతిక కాయం హోల్క‌ర్ ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో ఉన్న‌ది. అక్క‌డి నుంచి గ‌దిమా ఆడిటోరియానికి త‌ర‌లించ‌నున్నారు.

G

National | Published On Jan 29, 2026, 7.47 am IST

Ajit Pawar | నేడు బారామ‌తిలో అజిత్ ప‌వార్ అంత్య‌క్రియ‌లు.. పాల్గొన‌నున్న మోదీ, అమిత్ షా
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బారామ‌తిలో (Baramati) జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదంలో మ‌హారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, ఎన్సీపీ అధ్య‌క్షుడు అజిత్ ప‌వార్ (Ajit Pawar) దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆయ‌న‌తోపాటు మ‌రో న‌లుగురు మ‌ర‌ణించారు. బుధ‌వారం ఉద‌యం 8.45 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. విమానం ర‌న్‌వేపై దిగేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఒక్క‌సారిగా ఎడ‌వైపు ఒరికి కుప్ప‌కూలిపోయింది. మంట‌లు భారీగా ఎగ‌సిప‌డ‌టంతో అందులో ఉన్న అంతా స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మ‌ర‌ణించిన వారిలో అజిత్ ప‌వాత్‌తోపాటు ఆయ‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తాధికారి విదిప్ జాద‌వ్‌, కెప్టెన్ సుమిత్ కుమార్‌, కోపైల‌ట్ శాంభ‌వి పాఠ‌క్‌, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ఉన్నారు.

కాగా, అజిత్ ప‌వార్ అంత్య‌క్రియ‌ల‌ను (last rites) బారామ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం అజిత్ భౌతిక కాయం హోల్క‌ర్ ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో ఉన్న‌ది. అక్క‌డి నుంచి గ‌దిమా ఆడిటోరియానికి త‌ర‌లిస్తున్నారు. ప్ర‌జ‌లు, అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఆయ‌న పార్థివ‌దేహాన్ని గ‌దిమా ఆడిటోరియంలో ఉంచ‌నున్నారు. అనంత‌రం ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల మ‌ధ్య ఆయ‌న అంత్య‌క్రియ‌లు (Funeral) నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌తోపాటు ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు హాజ‌రుకానున్నారు. అజిత్ మృతికి సంతాపంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రోజుల‌పాటు సంతాప దినాల‌ను ప్ర‌క‌టించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement