Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
Hidden Treasure | గుప్తనిధుల (Hidden Treasure) పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
Hidden Treasure | త్రినేత్ర.న్యూస్: గుప్తనిధుల (Hidden Treasure) పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద రెండు కార్లు, ఆటో, రెండు బైకులు, సెల్‌ఫోన్లు, 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుడిమాల్కాపూర్‌కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా, మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్‌కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, కీసరకు చెందిన మహ్మద్ సల్మాన్‌గా గుర్తించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ.1 కోటి వరకు వసూలు చేశారని అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు మునావర్‌పై ఇప్పటికే బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైందని చెప్పారు.

ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసగాళ్లను, వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి అక్రమ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
- ●Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ కొత్త డబుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్బీ టైప్ సి తోనే ఛార్జింగ్..
- ●Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Harish Rao | కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందులను పట్టించుకోండి: హరీశ్ రావు
- ●PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ
- ●Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ భారీ డీల్.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి అడుగు..

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు

Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ కొత్త డబుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్బీ టైప్ సి తోనే ఛార్జింగ్..

Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి

Harish Rao | కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందులను పట్టించుకోండి: హరీశ్ రావు






