త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK | అదే జ‌రిగితే.. ముకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్ధం.. విజ‌య్ ఎమ్మెల్యేల హెచ్చ‌రిక‌

TVK | త‌మిళ‌నాడులో ( Tamil Nadu) ప్ర‌భుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం ఏ పార్టీకి లేక‌పోవ‌డం, 108 సీట్ల‌తో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే (TVK).. మెజార్టీ మార్కు చేరుకోవ‌డానికి ఇత‌రులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి విజ‌య్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డంపై సందిగ్ధం ఏర్ప‌డింది.

G

National | Published On May 8, 2026, 9.06 am IST

TVK | అదే జ‌రిగితే.. ముకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్ధం.. విజ‌య్ ఎమ్మెల్యేల హెచ్చ‌రిక‌
Advertisement

TVK | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడులో ( Tamil Nadu) ప్ర‌భుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం ఏ పార్టీకి లేక‌పోవ‌డం, 108 సీట్ల‌తో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే (TVK).. మెజార్టీ మార్కు చేరుకోవ‌డానికి ఇత‌రులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి విజ‌య్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డంపై సందిగ్ధం ఏర్ప‌డింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల్సిందిగా విజ‌య్‌ రెండుసార్లు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ టీవీకే పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌కుండా త‌మ‌ను అడ్డుకునేందుకు డీఎంకే (DMK), అన్నాడీఎంకేలు (AIADMK) ఒక్క‌టైతే.. టీవీకే ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డి రాజీనామాలు (Mass Resignation) చేయనున్న‌ట్లు తెలుస్తున్న‌ది. టీవీకే అధికారం చేప‌ట్ట‌కుండా నిరోధించే ప్ర‌య‌త్నంలో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి అన్నాడీఎంకేతో డీఎంకే చేతులు క‌లిపేందుకు ర‌హ‌స్య చ‌ర్చ‌లు ప్రారంభించింద‌న్న వార్త‌ల వెలువ‌డిన నేప‌థ్యంలో ఈ ప‌రిణామం చోటుచేసుకున్న‌ది.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ (Vijay) పార్టీ అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకున్నది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స‌రైన సంఖ్యా బ‌లం లేదు. రెండు స్థానాల్లో గెలుపొందిన విజ‌య్‌.. ఒక సీటును ఖాళీ చేయాల్సి ఉంది. దీంతో ఆ పార్టీ బ‌లం 107కు చేరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో వారి సంఖ్య 112కు పెరిగింది. అయితే 234 మంది స‌భ్యులు క‌లిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీలో మెజారిటీకి అవ‌స‌ర‌మైన 118 స్థానాలకు మ‌రో 6 అడుగుల దూరంలో నిలిచింది. ఈ నేప‌థ్యంలో డీఎంకే మిత్ర‌ప‌క్షాలైన చిరుత్తైగ‌ల్ క‌చ్చి (VCK), వామ‌ప‌క్ష పార్టీలు, ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ (IUML) సంప్ర‌దించింది. చెరో రెండు స్థానాల్లో గెలుపొందిన ఈ మూడు పార్టీలు విజ‌య్‌కి ఇంకా ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు.

కాగా, తాము ప్ర‌తిప‌క్షంలోనే ఉంటామ‌ని, విజ‌య్‌కి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స్టాలిన్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. డీఎంకే ఆరు నెలల పాటు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టదని, ప్రజలకు మార్పునకు అవకాశం ఇవ్వాలని చెప్పారు.

Advertisement
Advertisement