Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
Toxic Movie | స్టార్ హీరో.. భారీ బడ్జెట్.. పాన్ ఇండియా రిలీజ్.. వెరసి ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో నటించిన ముగ్గురు కథానాయికలకు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదనే చర్చ జరుగుతోంది. కియారా అద్వానీకి వరుస భారీ చిత్రాల తర్వాత మరోసారి నిరాశ ఎదురుకాగా.. నయనతారకు ఒకే సమయంలో వచ్చిన రెండు సినిమాలూ పెద్దగా కలిసిరాలేదు.
Entertainment | Published On Sep 2, 2026, 7.45 pm IST
Toxic Movie | స్టార్ హీరో.. భారీ బడ్జెట్.. పాన్ ఇండియా రిలీజ్.. వెరసి ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో నటించిన ముగ్గురు కథానాయికలకు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదనే చర్చ జరుగుతోంది. కియారా అద్వానీకి వరుస భారీ చిత్రాల తర్వాత మరోసారి నిరాశ ఎదురుకాగా.. నయనతారకు ఒకే సమయంలో వచ్చిన రెండు సినిమాలూ పెద్దగా కలిసిరాలేదు. ఇక తార సుతారియాకు ఎంతో ఆశగా చేసిన దక్షిణాది అరంగేట్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కియారా అద్వానీకి ‘టాక్సిక్’పై ప్రత్యేకమైన అంచనాలే ఉన్నాయి. మాతృత్వం తర్వాత విరామం తీసుకొని నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

అంతకుముందు ఆమె చేసిన ‘గేమ్ ఛేంజర్’, ‘వార్ 2’ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ‘టాక్సిక్’తో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించిన కియారాకు మరోసారి మిశ్రమ ఫలితమే ఎదురైంది. భారీ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మరింత బలపడాలనుకున్న ఆమెకు ఈ సినిమా కూడా అనుకున్నంత ఉపయోగపడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తార సుతారియా విషయానికొస్తే.. ‘టాక్సిక్’ ప్రచారంలో ఆమెకు లభించిన ప్రాధాన్యంతో యశ్ సరసన కీలక పాత్రలో కనిపించనుందని అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, పాటల్లోనూ ఆమె కనిపించడంతో పాత్రపై ఆసక్తి పెరిగింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆమె పాత్ర పరిమితంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని సన్నివేశాలు, ఓ పాటకే ఆమె ఎక్కువగా పరిమితం కావడంతో.. దక్షిణాదిలో బలమైన ఎంట్రీ ఇవ్వాలనుకున్న తారకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

లేడి మెగాస్టార్ నయనతారకు ‘టాక్సిక్’ పెద్దగా ఊరటనివ్వలేదు. యశ్ సోదరిగా కథలో ప్రాధాన్యమున్న పాత్రలో ఆమె కనిపించింది. అయితే సినిమా విడుదల తర్వాత ఆమె పాత్రపై పెద్దగా చర్చ జరగలేదు. దీనికి తోడు కవిన్ సరసన నటించిన ‘హాయ్’ కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఒకే సమయంలో వచ్చిన రెండు చిత్రాల ఫలితాలు నయనతారకు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన ‘టాక్సిక్’ యశ్‌కు మరోసారి పాన్ ఇండియా దృష్టిని తీసుకొచ్చినా.. ఇందులో నటించిన కియారా అద్వానీ, నయనతార, తార సుతారియాలకు మాత్రం కెరీర్‌లో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలవలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






