త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల‌ అవ‌స్థ‌లు.. కాగ‌జ్‌న‌గ‌ర్ ఎస్టీ బాయ్స్ ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను సంద‌ర్శించిన హ‌రీశ్ రావు

Harish Rao | ఆసిఫాబాద్ జిల్లాలోని కాగ‌జ్‌నగర్ (Kagaznaga) ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావు (Harish Rao) ఎమ్మెల్యే ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. పాఠశాలలోని వసతులు, భవనం, తాగునీటి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

G

Telangana | Published On Sep 4, 2026, 12.56 pm IST

Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల‌ అవ‌స్థ‌లు.. కాగ‌జ్‌న‌గ‌ర్ ఎస్టీ బాయ్స్ ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను సంద‌ర్శించిన హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఆసిఫాబాద్ జిల్లాలోని కాగ‌జ్‌నగర్ (Kagaznaga) ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావు (Harish Rao) ఎమ్మెల్యే ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. పాఠశాలలోని వసతులు, భవనం, తాగునీటి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో మాట్లాడారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు యూనిఫారాలు, సాక్సులు, టై, బెల్టులు, ఐడీ కార్డులు ఇవ్వలేదని విద్యార్థులు తెలిపారు. పాఠశాలలోని వాటర్ ప్లాంట్ (Water Plant) ఆరు నెలలుగా పనిచేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీటికి సరైన సౌకర్యం లేక స్నానం చేయడానికి ఉపయోగించే నీటినే తాగాల్సిన (Drinking Water) దుస్థితి ఉందని విద్యార్థులు తెలిపారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయంతో గడుపుతున్నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హ‌రీశ్ రావుతోపాటు ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement