త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | స‌మ్మ‌క్క సార‌క్క బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వానికి మంత్రి ఉత్త‌మ్ విజ్ఞ‌ప్తి

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: స‌మ్మ‌క్క సార‌క్క బ్యారేజీకి (Sammakka Sarakka Barrage) త్వ‌ర‌గా ఎన్ఓసీ జారీ చేయాల‌ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) ప్ర‌భుత్వాన్ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కోరారు.

G

Telangana | Published On Sep 4, 2026, 12.38 pm IST

Uttam Kumar Reddy | స‌మ్మ‌క్క సార‌క్క బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వానికి మంత్రి ఉత్త‌మ్ విజ్ఞ‌ప్తి
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: స‌మ్మ‌క్క సార‌క్క బ్యారేజీకి (Sammakka Sarakka Barrage) త్వ‌ర‌గా ఎన్ఓసీ జారీ చేయాల‌ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) ప్ర‌భుత్వాన్ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌గా ఎన్‍వోసీ (NOC) జారీ చేస్తే ప్రాజెక్టు ముంపు బాధితులకు పూర్తి పరిహారం చెల్సిస్తామని అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఎన్‍వోసీ ఇస్తే బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

బ్యారేజీలో పూర్తి స్థాయి నీటిమట్టం వరకు నీటిని నిల్వ చేసి, నిర్దేశిత సాగునీటి ప్రయోజనాలను రైతులకు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమక్క-సారక్క బ్యారేజీ ద్వారా మొత్తం 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెండింగ్ అంశాలను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రికి తెలిపినట్లు పేర్కొన్నారు.

ములుగు (Mulugu) జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టును నిర్మించారు. దీనిపొడవు 1,143 మీటర్లు కాగా 59 రేడియల్ గేట్లు ఉన్నాయి. దీనీ పూర్తి స్థాయి నీటిమట్టం 83 మీటర్ల వద్ద దీని రూపకల్పన నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాలకు నీరు అందించాలన్నారు. ఇక రామప్ప-పాకాల కాలువ కింద ములుగు జిల్లాలో 8 వేల ఎకరాలు, నర్సంపేట నియోజకవర్గంలో 22 వేల ఎకరాల కొత్త ఆయకట్టు ఉన్నట్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement