త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | ఉన్న సిటీని అడ్డంగా దోచుకోవ‌డానికే క్యూర్ చ‌ట్టం

KP Vivekananda | లేని ఫోర్త్ సిటీని సృష్టించి ఉన్న సిటీని దోచుకునేందుకే క్యూర్ చ‌ట్టం తెచ్చార‌ని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే, శాసన సభ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. ఈ చ‌ట్టంతో ముఖ్య‌మంత్రికే స‌ర్వాధికారాలు క‌ట్ట‌బెట్టార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 15, 2026, 3.09 pm IST

KP Vivekananda | ఉన్న సిటీని అడ్డంగా దోచుకోవ‌డానికే క్యూర్ చ‌ట్టం
Advertisement
  • అందులో స‌ర్వాధికారాలు ముఖ్య‌మంత్రికే క‌ట్ట‌బెట్టారు
  • ట్యాక్స్‌లు విప‌రీతంగా పెరిగే అవ‌కాశ‌ముంది
  • న్యాయ నిపుణ‌ల‌తో మాట్లాడి లీగ‌ల్‌గా కొట్లాడుతం
  • ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్‌

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌: లేని ఫోర్త్ సిటీని సృష్టించి ఉన్న సిటీని దోచుకునేందుకే క్యూర్ చ‌ట్టం తెచ్చార‌ని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే, శాసన సభ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. ఈ చ‌ట్టంతో ముఖ్య‌మంత్రికే స‌ర్వాధికారాలు క‌ట్ట‌బెట్టార‌ని మండిప‌డ్డారు. దీనితో ట్యాక్స్‌లు విప‌రీతంగా పెరిగి పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల న‌డ్డి విరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ చ‌ట్టం నిల‌బ‌డ‌ద‌ని.. న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి లీగ‌ల్‌గా ముందుకు వెళ్తామ‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. క్యూర్ చ‌ట్టంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

క్యూర్ చట్టం ఒక్కరోజే చర్చ జరిగింది. బిల్లు పాస్ అయింది. 465పేజీలు ఉన్న క్యూర్ చట్టం కేవలం అర గంటలో చట్టం అంశాలను చదివి చర్చ జరపడం సాధ్యం అవుతుందా? అసెంబ్లీలో కూడా కేవలం ఒక్కరోజులోనే దిన్ని చర్చ చేసి బిల్లు పాస్ చేయించారు. ఏదో ఆదరాబాదరాగా చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం తప్పించుకోపోయింది. చాలా ముఖ్యమైన బిల్లు ఇది. ఒక్కరోజే ఎలా సాధ్యం అయింది.

ముఖ్యమంత్రి ఏదో దోచుకోవాలనే తప్ప ఇంకోటి లేదు. ఎలా అయినా దోచుకో దాచుకో తప్ప మరోటి లేదు. అధికారంలోకి వచ్చేది లేదని అన్ని స‌దురుకుంటున్నారు. అందుకే ఇలాంటి చట్టాలను తెచ్చి దోచుకుంటున్నారు. 1955 మున్సిపల్ చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తెచ్చే ముందు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేం చెప్తూనే ఉన్నాం.

అది బంగారు గుడ్లు పెట్టే బాతు..

హైద‌రాబాద్ నగరం అనేది బంగారు గుడ్లు పెట్టే బాతు.. అలాంటి బాతును పెంచి పోషించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడకు పోతున్నాడు. పేరుకు ప్రజా పాలన.. అంత ఉత్తదే. వాక్ స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారు. మా అధినేత కేసీఆర్ ఇంటిపై పోలీసుల‌ను ఉసగోల్పి దాడికి ప్లాన్ చేశారు. ఆధారం శాశ్వతం కాదు. ప్రజావాణి వినడం లేదు. కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తిచూపితే ప్రజావాణి నాయకుడిని తీసి అవతల పడేశారు. నిన్న పొలీస్ స్టేషన్లో జరిగిన కేటీఆర్ పీఆర్వో, పీఏలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నా.

చైర్మ‌న్‌ల‌కు, ఎమ్మెల్యేల‌కు కూడా అధికారాలు లేవ్‌..

అన్ని శాఖలు అన్ని కూడా ఆగమాగం ఉన్నాయి. ఎలాంటి అధ్యయనం లేకుండా, ఎలాంటి అవగాహన లేకుండా తెచ్చిన చట్టం క్యూర్ చట్టం. రానున్న మూడు కార్పొరేషన్ ఛైర్మన్ లకు ఎలాంటి అధికారాలు లేకుండా ఈ చట్టం రూపొందించారు. చివరికి శాసన సభ్యులకు కూడా అధికారాలు లేవు. ఆస్తి పన్ను పెరిగితే ఎంత భారం అవుతుందో అర్థం చేసుకోవాలి. అడ్డంగా దోచుకోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. దీనిలో పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకు ఈ చట్టం తెచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టడం లేదు. దోమల మందు కొట్టేవాడు కూడా లేడు. పేద ప్రజలకు, శివారు నగర ప్రజలకు కొత్త క్యూర్ చట్టం ద్వారా పెనుభారం కానున్నది. లేని ఫోర్త్ సిటీ సృష్టించి ఉన్న సిటీని దోచుకునేందుకు ఈ చట్టం తప్ప ఇంకోటి కాదు. అన్ని ఆధారాలు ఉన్నాయి.. ఈ చట్టం నిలబడే చట్టం కాదు. న్యాయ నిపుణులతో చర్చించి ఈ చట్టంపై లీగల్‌గా ముందుకు వెళ్తాం.

Advertisement
Advertisement