RS Praveen Kumar | ముసుగు వ్యక్తులు ఎవరు..? కచ్చితంగా కుట్రనే..!
RS Praveen Kumar | నిన్న సైఫాబాద్ పీఎస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై దాడి చేసిన ముసుగు వ్యక్తులెవరు? అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
డీజే పర్మిషన్‌కు 30 మంది వస్తారా..?
మాస్కులు ఎందుకు ధరించాల్సి వచ్చింది..?
పోలీసులకు అనుమానం రావాలి కదా..?
నిలదీసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : నిన్న సైఫాబాద్ పీఎస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై దాడి చేసిన ముసుగు వ్యక్తులెవరు? అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అంతమంది పోలీసులు ఉండగా.. వారిని ఎందుకు అడ్డుకోలేదు..? ఒక్కరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉంది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ పీఏ, పీఆర్వోలను నిన్న సాయంత్రం 6 గంటల వరకు కావాలనే పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. 30 మంది మాస్కులు ధరించి తిరుగుతుంటే పోలీసులకు అనుమానం రావాలి కదా? పీఎస్‌లో ఉన్న మహేశ్, మహేందర్‌లపై దాడి చేసి పారిపోతుంటే ఒక్క పోలీసు కూడా వారిని పట్టుకోలేదు. కేటీఆర్ సిబ్బందిపై జరిగిన దాడి అనుకోకుండా జరిగింది కాదు, కావాలనే చేశారు.
ఎవరైనా మాస్కులు పెట్టుకుని డీజే పర్మిషన్ కోసం వస్తారా? డీజే పర్మిషన్ కోసం ఒక్కరో ఇద్దరో వస్తరు.. 30 మంది రారు. వచ్చినవాళ్ళు స్థానికులని డీసీపీ చెప్తున్నారు.. ఒకవేళ స్థానికులైతే వాళ్లను ఎందుకు పట్టుకోలేదు? దొంగల చేతులోకి పోలీస్ వ్యవస్థ వెళ్తే ఎలా ఉంటుందో నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. నిన్న జరిగినవేవీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. పోలీసులను అమ్మనా బూతులు తిట్టిన జగ్గారెడ్డిని ఎందుకు విచారించలేదు? పోలీసులను పావులుగా వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులారా.. రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడకండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●‘సారీ’ చెప్పలేదు.. పార్టీని వీడలేదు.. అసలు కొండా ప్లాన్ ఏంటి?
- ●Vice President | 17న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
- ●Apple | ఐక్లౌడ్ సేవలను విస్తరించిన యాపిల్.. నెలకు రూ.75కే ప్లాన్, 50జీబీ స్టోరేజ్..
- ●SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
- ●Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?
- ●Vijay Sethupathi | తమిళనాట హీట్ పెంచిన విజయ్ సేతుపతి కామెంట్లు - సీఎం విజయ్ పాలనపై కౌంటర్ అంటోన్న నెటిజన్లు

‘సారీ’ చెప్పలేదు.. పార్టీని వీడలేదు.. అసలు కొండా ప్లాన్ ఏంటి?

Vice President | 17న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Apple | ఐక్లౌడ్ సేవలను విస్తరించిన యాపిల్.. నెలకు రూ.75కే ప్లాన్, 50జీబీ స్టోరేజ్..

SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన





