త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Advance Tax | వేత‌న జీవులు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలా.. అస‌లు విషయం తెలుసుకోండి..

Advance Tax | సెప్టెంబర్‌ 15 అడ్వాన్స్‌ ట్యాక్స్‌ రెండో విడత చెల్లింపునకు చివరి తేదీ. జీతం నుంచి ప్రతి నెలా యజమాని ట్యాక్స్‌ డిడక్ట్‌ చేస్తున్నందున తమకు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ అవసరం లేదని చాలామంది ఉద్యోగులు భావిస్తారు. అయితే జీతంతోపాటు మ్యుచువల్‌ ఫండ్లు, షేర్లు, బ్యాంక్‌ డిపాజిట్లు, అద్దె, వడ్డీ, డివిడెండ్లు వంటి ఇతర ఆదాయాలు ఉంటే అదనపు ట్యాక్స్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది.

S

Business | Published On Sep 15, 2026, 2.51 pm IST

Advance Tax | వేత‌న జీవులు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలా.. అస‌లు విషయం తెలుసుకోండి..
Advertisement

Advance Tax | సెప్టెంబర్‌ 15 అడ్వాన్స్‌ ట్యాక్స్‌ రెండో విడత చెల్లింపునకు చివరి తేదీ. జీతం నుంచి ప్రతి నెలా యజమాని ట్యాక్స్‌ డిడక్ట్‌ చేస్తున్నందున తమకు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ అవసరం లేదని చాలామంది ఉద్యోగులు భావిస్తారు. అయితే జీతంతోపాటు మ్యుచువల్‌ ఫండ్లు, షేర్లు, బ్యాంక్‌ డిపాజిట్లు, అద్దె, వడ్డీ, డివిడెండ్లు వంటి ఇతర ఆదాయాలు ఉంటే అదనపు ట్యాక్స్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. ఒక వ్యక్తికి ఏడాది మొత్తంలో ట్యాక్స్‌ డిడక్షన్‌ లేదా కలెక్షన్‌ తర్వాత చెల్లించాల్సిన నికర పన్ను రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది. యజమాని జీతంతోపాటు ఇతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని తగినంత ట్యాక్స్‌ డిడక్ట్‌ చేస్తే ప్రత్యేకంగా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇతర ఆదాయాలపై సరిపడా ట్యాక్స్‌ కట్‌ కాకపోతే మిగిలిన మొత్తాన్ని అడ్వాన్స్‌ ట్యాక్స్‌గా చెల్లించాలి.

స్టాక్ మార్కెట్ ఆదాయాలు ఉంటే..

మ్యుచువల్‌ ఫండ్లు లేదా షేర్లను విక్రయించడం ద్వారా క్యాపిటల్‌ గెయిన్స్‌ రావడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ, అద్దె ఆదాయం, బాండ్లపై వడ్డీ, డివిడెండ్‌ ఆదాయం, ఫ్రీలాన్స్‌ లేదా కన్సల్టింగ్‌ ఆదాయం వంటి వాటి వల్ల అదనపు పన్ను భారం ఏర్పడుతుంది. అందువల్ల జీతం ఒక్కటే ఆదాయం కాని ఉద్యోగులు తమ మొత్తం వార్షిక ఆదాయాన్ని లెక్కించుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంత చెల్లించాలి..

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన వారికి సెప్టెంబర్‌ 15 నాటికి మొత్తం అంచనా అడ్వాన్స్‌ ట్యాక్స్‌లో 45 శాతం చెల్లించి ఉండాలి. జూన్‌ 15 నాటికి 15 శాతం ఇప్పటికే చెల్లించి ఉంటే, సెప్టెంబర్‌ 15 నాటికి మొత్తం 45 శాతానికి చేరేలా మిగిలిన 30 శాతం చెల్లించాలి. ఉదాహరణకు ఏడాదికి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ రూ.1 లక్షగా అంచనా వేస్తే, జూన్‌లో రూ.15వేలు చెల్లించిన వ్యక్తి సెప్టెంబర్‌ 15 నాటికి మరో రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా సరైన మొత్తంలో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించకపోతే వడ్డీ భారం పడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement