Air India | అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ఎందుకంటే?
Air India | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) అమెరికాకు వెళ్లే విమానాలపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఆది, సోమవారాల్లో అమెరికాకు వెళ్లే విమానాలను రద్దు (Flights Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది.
త్రినేత్ర.న్యూస్: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) అమెరికాకు వెళ్లే విమానాలపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఆది, సోమవారాల్లో అమెరికాకు వెళ్లే విమానాలను రద్దు (Flights Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. మంచు తుఫాను కారణంగా న్యూయార్క్, నెవార్క్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను క్యాన్సల్ చేసింది. ఈ మేరకు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.
న్యూయార్క్, న్యూజెర్సీలతోపాటు అమెరికా తూర్పుతీర ప్రాంతాల్లో జనవరి 25, 26 తేదీల్లో భారీ మంచు కురుస్తుందని అంచనా. ఇవి విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్ట్యా ఈ రెండు రోజుల్లో న్యూయార్క్, న్యూజెర్సీలకు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు చేస్తున్నాం. ఈ తేదీల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి సాయం చేసేందుకు మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా తెలుసుకోవాలంటూ` ఎయిర్ ఇండియా అడ్వైజరీలో పేర్కొంది.
కాగా, అమెరికాకు మంచు తుఫానుల భయం పట్టుకున్నది. ఈ వారంతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర మంచు తుఫాను సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫానును ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
https://x.com/airindia/status/2014956332147986796?s=20
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026

Air India | బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ముంబైలో ల్యాండ్
ఏప్రిల్ 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



