త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Chief Marshal A.P. Singh | భార‌త్ చేరుకోలేని ల‌క్ష్యం లేదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఏపీ సింగ్‌

Air Chief Marshal A.P. Singh | భార‌త సైన్యం (Indian Army)  చేరుకోలేని ల‌క్ష్య‌మేదీ లేద‌ని ఎయిర్‌ఫోర్స్ అధిప‌తి ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఏపీ సింగ్ (Air Chief Marshal A.P. Singh) అన్నారు.

S

National | Published On Oct 25, 2026, 3.47 pm IST

Air Chief Marshal A.P. Singh | భార‌త్ చేరుకోలేని ల‌క్ష్యం లేదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఏపీ సింగ్‌
Advertisement

Air Chief Marshal A.P. Singh | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త సైన్యం (Indian Army)  చేరుకోలేని ల‌క్ష్య‌మేదీ లేద‌ని ఎయిర్‌ఫోర్స్ అధిప‌తి ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఏపీ సింగ్ (Air Chief Marshal A.P. Singh) అన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌తో ఈ విష‌యం రుజువైంద‌ని చెప్పారు. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన ఆయుధాలు చ‌క్క‌గా ప‌నిచేస్తున్నాయ‌న‌డానికి సిందూర్ విజ‌య‌వంత‌మే ఉదాహ‌ర‌ణ అని వివ‌రించారు. ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న పీటీఐ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌ను పంచుకున్నారు.

ఆయ‌న ఇంకా మాట్లాడుతూ దేశ ర‌క్ష‌ణ రంగంలో వైమానిక ద‌ళం అత్యంత కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చెప్పారు. దేశ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మ‌రింత వేగం, క‌చ్చిత‌త్వంతో ముందుకు సాగుతామ‌ని పేర్కొన్నారు. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను తాము నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. ఆ ప్రాంతంలో శాంతిని నెల‌కొల్పేందుకు భార‌త్ స‌హా క్వాడ్ దేశాలు ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు.

Advertisement
Advertisement