త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Protests in France | అట్టుడుకుతున్న ఫ్రాన్స్‌.. యూరప్​ వ్యాప్తంగా భారీ ఆందోళనలు

Protests in France | ఇటీవ‌ల ఫ్రాన్స్‌ (France)లో ప్రారంభ‌మైన నిర‌స‌న‌లు యూర‌ప్‌లోని ఇత‌ర దేశాల‌కు సైతం వ్యాపించాయి. మ‌రోవైపు ఫ్రాన్స్ ఆందోళ‌న‌ల‌(Protests)తో అట్టుడుకుతోంది.

S

International | Published On Oct 25, 2026, 3.37 pm IST

Protests in France | అట్టుడుకుతున్న ఫ్రాన్స్‌.. యూరప్​ వ్యాప్తంగా భారీ ఆందోళనలు
Advertisement
  • పెరుగుతున్న జీవ‌న‌వ్య‌యం, విద్యా వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లే కార‌ణం
  • వివిధ న‌గ‌రాల్లో పోలీసులు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు

Protests in France | త్రినేత్ర న్యూస్: ఇటీవ‌ల ఫ్రాన్స్‌ (France)లో ప్రారంభ‌మైన నిర‌స‌న‌లు యూర‌ప్‌లోని ఇత‌ర దేశాల‌కు సైతం వ్యాపించాయి. మ‌రోవైపు ఫ్రాన్స్ ఆందోళ‌న‌ల‌(Protests)తో అట్టుడుకుతోంది. కొన్ని న‌గ‌రాల్లో పోలీసులు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. కేవ‌లం ఫ్రాన్స్‌లోనే దాదాపు 4 ల‌క్ష‌ల మందిపైగా రోడ్లెక్కిన‌ట్లు అంచ‌నా. పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు వ్యతిరేకంగా ఈ నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లోనే ఏకంగా 1.10 లక్షల మంది ర్యాలీలో పాల్గొన్నారు. పారిస్‌ సహా స్ట్రాస్‌బర్గ్, రెన్నెస్ తదితర నగరాల్లో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు టియ‌ర్‌గ్యాస్‌, వాట‌ర్ కెనాన్లు ప్ర‌యోగించారు. పోలీసులు సుమారు వెయ్యిమంది ఆందోళ‌న‌కారుల‌ను అరెస్టు చేసిన‌ట్లు ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించింది. వారం రోజుల క్రితం ఆందోళ‌న‌ల్లో ప‌లు అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంతో పోలీసులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా దేశ‌వ్యాప్తంగా సుమారు 70 వేల మంది పోలీసుల‌ను మోహ‌రించారు.

అల్బేనియా రాజధాని టిరానాలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌ధాని రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల‌కు నిర‌స‌న‌కారుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆగ్ర‌హించిన వారు రాళ్లు విసురుతూ ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. పెట్రోల్ బాంబులు సైతం విస‌ర‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని నిలువ‌రించేందుకు భ‌ద్ర‌తాబ‌ల‌గాలు లాఠీచార్జ్ చేయ‌డంతో పాటు టియ‌ర్‌గ్యాస్‌, వాట‌ర్ కెనాన్లు ప్ర‌యోగించారు. మ‌రోవైపు గాజా యుద్ధానికి వ్య‌తిరేకంగా ఇట‌లీలో యువ‌త నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఈ నిర‌స‌న‌ల్లో స్వ‌ల్ప‌ ఘ‌ర్ష‌ణ‌లు మిన‌హా ఎటువంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement