త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CID Raids | కస్ట‌మ్ మిల్లింగ్ రైస్‌లో అక్ర‌మాలు.. తెల్లార‌క‌ముందే 150 మిల్ల‌ర్ల అరెస్ట్‌

తెలంగాణ రాష్ట్రంలో సీఐడీ (CID) భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. క‌స్ట‌మ్ మిల్లింగ్ రైస్ (Custom Milled Rice-CMR) స‌ర‌ఫరాలో భారీ అక్ర‌మాల నేప‌థ్యంలో ఒకేసారి 150 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

S

Telangana | Published On Oct 25, 2026, 2.36 pm IST

CID Raids | కస్ట‌మ్ మిల్లింగ్ రైస్‌లో అక్ర‌మాలు.. తెల్లార‌క‌ముందే 150 మిల్ల‌ర్ల అరెస్ట్‌
Advertisement
  • ఎక్క‌డిక‌క్క‌డ విస్తృత త‌నిఖీలతో మిల్ల‌ర్ల గుండెల్లో ద‌డ‌
  • కుంభకోణం వెనుక ఉన్న అధికారులు, వ్యాపారుల పాత్రపై సీఐడీ ఆరా

CID Raids | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సీఐడీ (CID) భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. క‌స్ట‌మ్ మిల్లింగ్ రైస్ (Custom Milled Rice-CMR) స‌ర‌ఫరాలో భారీ అక్ర‌మాల నేప‌థ్యంలో ఒకేసారి 150 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగి ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తో పాటు ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

ప్ర‌త్యేక బృందాలుగా ఏర్ప‌డి

వివ‌రాల్లోకి వెళ్తే.. సీఐడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆదివారం ఉదయం 5 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మెరుపు దాడులు ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో నలుగురు రైస్ మిల్లు యజమానులను అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న మిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

స‌న్న వ‌డ్ల‌కు దొడ్డు బియ్యం స‌ర‌ఫ‌రా

ప్రభుత్వం మిల్లింగ్ కోసం ధాన్యాన్ని కేటాయించ‌గా నిబంధనల ప్రకారం అప్పగించాల్సిన నాణ్యమైన సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లేలా చేశారనే అభియోగాలపై సీఐడీ ముమ్మ‌ర‌ దర్యాప్తు చేప‌డుతుండ‌డం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఈ కుంభకోణం వెనుక ఉన్న ఇతర అధికారుల, వ్యాపారుల పాత్రపై కూడా సీఐడీ పూర్తిస్థాయిలో లోతుగా విచారణ జ‌రుపుతోంది. ఇటీవ‌లే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ అధికారులు ఓవైపు దాడులు ముమ్మరం చేయగా, తాజాగా మ‌రోవైపు సీబీ సీఐడీ రంగంలోకి దిగ‌డంతో మిల్ల‌ర్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ఎలాంటి వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతాయోన‌న్న సందిగ్ధ ప‌రిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Advertisement