Dasoju Sravan | అలయ్ బలయ్‌తో బంధాలు ఇంకింత బలపడాలే
Dasoju Sravan | అలయ్ బలయ్ (Alai-Balai)తో బంధాలు ఇంకింత బలపడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఆకాంక్షించారు.
- పూర్వికుల పోరాట స్ఫూర్తి వెంట నడవాలే
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పిలుపు
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: అలయ్ బలయ్(Alai-Balai)తో బంధాలు ఇంకింత బలపడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఆకాంక్షించారు. మాదిగ సమాజానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. అందరం ఒకే సమాజానికి చెందినవారిగా, ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలుస్తూ, ఒకరి విజయాన్ని మరొకరు మన విజయంగా భావిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగించారు.
విద్యనే బలం, ఐక్యతే ఆయుధం
అలయ్ బలాయ్ అంటే ఆత్మీయత.. అలయ్ బలాయ్ అంటే ఐక్యత.. అలయ్ బలాయ్ అంటే సోదరభావం. మన పూర్వీకులు ఎన్నో కష్టాలు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వారి పోరాట స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన సమాజానికి విద్యే బలం.. ఐక్యతే ఆయుధం.. ఆత్మగౌరవమే మన గుర్తింపు.
మన హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, గౌరవప్రదమైన జీవనం ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా మన మధ్య ఆత్మీయ సంబంధాలు మరింత బలపడాలి. పరస్పర సహకారం పెరగాలి. సమాజంలో ఐక్యత, చైతన్యం, అభివృద్ధి మరింత విస్తరించాలి అని దాసోజు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అంజన్న, నవీన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

ACB Raids | లెక్కలేని డబ్బు రూ.2.40 లక్షలు.. ఏసీబీకి పట్టుబడ్డ జలమండలి అధికారి
అక్టోబర్ 25, 2026

CID Raids | కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో అక్రమాలు.. తెల్లారకముందే 150 మిల్లర్ల అరెస్ట్
అక్టోబర్ 25, 2026

All-Party Meeting | 28న అఖిలపక్ష సమావేశం.. ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చ
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●ACB Raids | లెక్కలేని డబ్బు రూ.2.40 లక్షలు.. ఏసీబీకి పట్టుబడ్డ జలమండలి అధికారి
- ●JEE Main | జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 రిజిస్ట్రేషన్లు షురూ.. జనవరి 20 నుంచి ఎగ్జామ్స్
- ●CID Raids | కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో అక్రమాలు.. తెల్లారకముందే 150 మిల్లర్ల అరెస్ట్
- ●All-Party Meeting | 28న అఖిలపక్ష సమావేశం.. ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చ
- ●Ponnam Prabhakar | రూ.2.57 కోట్లతో ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ
- ●Gutha Sukender Reddy | ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే కావాలంటే.. కర్ణాటక నుంచి దిగువకు చుక్క నీరు కూడా రాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

ACB Raids | లెక్కలేని డబ్బు రూ.2.40 లక్షలు.. ఏసీబీకి పట్టుబడ్డ జలమండలి అధికారి

JEE Main | జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 రిజిస్ట్రేషన్లు షురూ.. జనవరి 20 నుంచి ఎగ్జామ్స్

CID Raids | కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో అక్రమాలు.. తెల్లారకముందే 150 మిల్లర్ల అరెస్ట్

All-Party Meeting | 28న అఖిలపక్ష సమావేశం.. ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చ





