త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | లెక్క‌లేని డ‌బ్బు రూ.2.40 లక్షలు.. ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ జ‌ల‌మండ‌లి అధికారి

ACB Raids | హైద‌రాబాద్‌లో ఏసీబీ (ACB) అధికారులు జ‌రిపిన‌ మెరుపుదాడుల్లో జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారి ప‌ట్టుబ‌డ్డారు.

S

Hyderabad | Published On Oct 25, 2026, 2.59 pm IST

ACB Raids | లెక్క‌లేని డ‌బ్బు రూ.2.40 లక్షలు.. ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ జ‌ల‌మండ‌లి అధికారి
Advertisement

ACB Raids | త్రినేత్ర న్యూస్: హైద‌రాబాద్‌లో ఏసీబీ (ACB) అధికారులు జ‌రిపిన‌ మెరుపుదాడుల్లో జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారి ప‌ట్టుబ‌డ్డారు. ఖైరతాబాద్ వాటర్ బోర్డు జాయింట్ డైరెక్టర్‌ (Khairathabad Water Board Joint Director)గా పనిచేస్తున్న ఎ.శ్రీనివాస్‌ (Srinivas) లెక్క‌లేని రూ.2.40 ల‌క్ష‌ల న‌గ‌దును త‌న కారులో తీసుకెళ్తుండ‌గా అధికారులు వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్నారు. శనివారం రాత్రి కార్యాల‌యం నుంచి ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో రాజ్‌భవన్‌ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో తనిఖీలు చేపట్టి న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారులు నగదుకు సంబంధించి అడిగిన ప్ర‌శ్న‌ల‌పై శ్రీనివాస్‌ ఇచ్చిన వివరణ స‌రిగా లేక‌పోవ‌డంతో అవినీతి కోణంలో విచార‌ణ ప్రారంభించారు. ప‌క్కా స‌మాచారంతో దాడి చేసి ప‌ట్టుకున్న‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై ఆదాయపు పన్నుశాఖకు సమాచారం ఇవ్వనున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement