త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

All-Party Meeting | 28న అఖిల‌ప‌క్ష స‌మావేశం.. ఎల్‌నినో, క‌రువు ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

All-Party Meeting | తెలంగాణ‌లో ఎల్‌నినో (El Nino) ప్ర‌భావం, క‌రువు ప‌రిస్థితుల‌పై ఈనెల 28న ప్ర‌భుత్వం అఖిల‌ప‌క్ష స‌మావేశం (All-Party Meeting) నిర్వ‌హించ‌నుంది.

S

Telangana | Published On Oct 25, 2026, 1.24 pm IST

All-Party Meeting | 28న అఖిల‌ప‌క్ష స‌మావేశం.. ఎల్‌నినో, క‌రువు ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌
Advertisement
  • ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అధ్య‌క్ష‌త‌న‌ భేటీ
  • క‌రువును దాటేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లను కోర‌నున్న ప్ర‌భుత్వం

All-Party Meeting | త్రినేత్ర న్యూస్: తెలంగాణ‌లో ఎల్‌నినో (El Nino) ప్ర‌భావం, క‌రువు ప‌రిస్థితుల‌పై ఈనెల 28న ప్ర‌భుత్వం అఖిల‌ప‌క్ష స‌మావేశం (All-Party Meeting) నిర్వ‌హించ‌నుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన జ‌రిగే ఈ భేటీలో క‌రువును ఎదుర్కొనేందుకు వివిధ రాజ‌కీయ పార్టీల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు కోర‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని పార్టీల నేత‌ల‌తో కలిసి సమావేశం ఏర్పాటు చేయ‌నున్నారు.
‎
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై ప్ర‌ధానంగా చర్చించే అవ‌కాశాలున్నాయి. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్ సరఫరాపైనా చ‌ర్చించ‌నున్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కరువు నివారణ చర్యలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించాయి.

Advertisement
Advertisement