త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వ‌ర‌కు ద‌రాఖాస్తు గ‌డువు

AIIMS Recruitment | దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ ద‌వాఖాన‌ల్లో (AIIMS Recruitment) నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేష‌న్‌-5 ద్వారా గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో 1484 ఖాళీల‌ను ఎయిమ్స్ ఢిల్లీ భ‌ర్తీ చేస్తున్న‌ది.

G

National | Published On Jun 17, 2026, 9.50 am IST

AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వ‌ర‌కు ద‌రాఖాస్తు గ‌డువు
Advertisement

AIIMS Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ ద‌వాఖాన‌ల్లో (AIIMS Recruitment) నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేష‌న్‌-5 ద్వారా గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో 1484 ఖాళీల‌ను ఎయిమ్స్ ఢిల్లీ భ‌ర్తీ చేస్తున్న‌ది. ఇందులో దేశ‌వ్యాప్తంగా ఉన్న 28 ఎయిమ్స్ ద‌వాఖాన‌లు పాలుపంచుకుంటున్నాయి. మొత్తం 57 గ్రూపులుగా ఈ పోస్టులను వ‌ర్గీక‌రించారు. ఇందులో అడ్మినిస్ట్రేటివ్‌, పారామెడిక‌ల్‌, టెక్నిక‌ల్‌, అటెండెంట్ వంటి వంద‌లాది కేట‌గిరీ పోస్టులు ఉన్నాయి. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన‌వారు ఈనెల 30 లోపు www.aiimsexams.ac.inలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. బీబీన‌గ‌ర్‌లోని ఎయిమ్స్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 1484
అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.

ఎంపిక విధానం

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా. ప‌రీక్ష 100 మార్కుల‌కు ఉంటుంది. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 90 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ. 3000, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ రూ.2400, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 30
ప‌రీక్ష తేదీలు: జూలై 25 నుంచి 27 వ‌ర‌కు (నిర్ధారించాల్సి ఉంది)
వెబ్‌సైట్‌: www.aiimsexams.ac.in

 

Advertisement
Advertisement