త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nursing Officer | ఎయిమ్స్‌లో న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ఆగ‌స్టు 13వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

Nursing Officer | న్యూఢిల్లీలోని ప్ర‌తిష్ఠాత్మ‌క వైద్య విజ్ఞాన సంస్థ‌ ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్ (AIIMS) న‌ర్సింగ్ ఆఫీస‌ర్ (Nursing Officer) పోస్టుల నియామ‌కాలు చేప‌ట్టింది.

G

National | Published On Jul 24, 2026, 11.28 am IST

Nursing Officer | ఎయిమ్స్‌లో న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ఆగ‌స్టు 13వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు
Advertisement

Nursing Officer | త్రినేత్ర‌.న్యూస్‌: న్యూఢిల్లీలోని ప్ర‌తిష్ఠాత్మ‌క వైద్య విజ్ఞాన సంస్థ‌ ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్ (AIIMS) న‌ర్సింగ్ ఆఫీస‌ర్ (Nursing Officer) పోస్టుల నియామ‌కాలు చేప‌ట్టింది. బీఎస్సీ న‌ర్సింగ్, పోస్ట్ బీఎస్సీ న‌ర్సింగ్‌, జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ మిడ్‌పైఫ‌రీలో డిప్లొమా (GNM) చేసిన వారు ఎయిమ్స్ వెబ్‌సైట్ https://www.aiimsexams.ac.in/లో ఆగ‌స్టు 13 వ‌ర‌కు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్ర‌తినెల రూ.9300 నుంచి రూ.34800 వ‌ర‌కు జీతం అందుకోవ‌చ్చు. అయితే పోస్టుల సంఖ్య వెల్ల‌డించ‌లేదు.

అర్హ‌త‌లు: బీఎస్సీ న‌ర్సింగ్ (హాన‌ర్స్‌), బీఎస్సీ (పోస్టు స‌ర్టిఫికెట్‌), పోస్టు బేసిక్ బీఎస్సీ న‌ర్సింగ్‌, జీఎన్ఎం పూర్తిచేసి ఉండాలి.

అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.. రాత‌ప‌రీక్ష రెండు ద‌శ‌ల్లో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 24
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 13
అప్లికేష‌న్ ఫీజు: రూ.3000, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.2400, పీడ‌బ్ల్యూబీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్‌చేయండి..

Advertisement
Advertisement