AIIMS | మారిన బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సమయాలు.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి
AIIMS | అత్యుత్తమ సేవలు అందించే బీబీనగర్‌లోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ (AIIMS Bibinagar) దవాఖాన రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఓపీడీ (OPD) రిజిస్ట్రేషన్ సమయాలను సవరిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
AIIMS | త్రినేత్ర.న్యూస్: అత్యుత్తమ సేవలు అందించే బీబీనగర్‌లోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ (AIIMS Bibinagar) దవాఖాన రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఓపీడీ (OPD) రిజిస్ట్రేషన్ సమయాలను సవరిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. మారిన సమయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కొత్త సమయాల ప్రకారం (OPD timings) రోగులు ముందుగానే ప్రణాళిక చేసుకు హాస్పిటల్‌కు రావాలని సూచించింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు OPD రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. ఇక వైద్యులు ఉదయం 9 నుంచి రాత్రి ఒంటి గంట వరకు రోగులను పరిశీలిస్తారని పేర్కొంది.
అదేవిధంగా కొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేక ఓపీడీ రోజులను ప్రకటించింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, సోమ, బుధ, శుక్రవారాల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలు సేవలందిస్తాయని వెల్లడించింది. ఇక సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో యూరాలజీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎయిమ్స్‌లో కేవలం రూ.10కి డాక్టర్ ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎయిమ్స్‌లో లభించే ముఖ్య సేవలు..
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ (చిన్నారుల వైద్యం)గైనకాలజీ (స్త్రీల వైద్యం), ఆర్థోపెడిక్స్ (కీళ్లు, ఎముకల వైద్యం)డెర్మటాలజీ (చర్మ వ్యాధులు), ఆప్తాల్మాలజీ (కంటి వైద్యం)కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు లభిస్తాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nursing Officer | ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్టు 13వరకు దరఖాస్తులు
జులై 24, 2026

AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వరకు దరాఖాస్తు గడువు
జూన్ 17, 2026

High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా ‘హైబీపీ’.. ఏటా 16 లక్షల మంది బలి
మే 28, 2026
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన



