Mallikarjun Kharge | యూజ్‌లెస్ ఫెలోస్.. కాంగ్రెస్ కార్యకర్తలపై ఖర్గే ఆగ్రహం
Mallikarjun Kharge | `యూజ్‌లెస్ ఫెలోస్ (Useless Fellows).. ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు` అంటూ సొంత పార్టీ కార్యకర్తలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు.
Mallikarjun Kharge | త్రినేత్ర.న్యూస్: `యూజ్‌లెస్ ఫెలోస్ (Useless Fellows).. ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు` అంటూ సొంత పార్టీ కార్యకర్తలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. సభలో కేవలం కొద్దిమంది మాత్రమే అల్లరి చేస్తుంటే, మిగిలినవారు ఇక్కడికి ఊడ్చడానికి వచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పెద్దాయనకు కోపం ఎందుకు వచ్చిందంటే..
కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ `సంకల్ప సభ` (Sankalpa Samavesha) జరిగింది. ఈ కార్యక్రమానికి ఖర్గేతోపాటు సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), మాజీ సీఎం సిద్దరామయ్య, మంత్రులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభికులను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతుండగా.. కొందరు కార్యకర్తలు ముఖ్యమంత్రికి మద్దతుగా `డీకే.. డీకే` (DK.. DK) అటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆపాలని కోరినప్పటికీ అదేపనిగా నినాదాలు చేస్తుండటంతో అసహనానికి గురైన ఖర్గే.. `ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుంది?. ఇది ఒక వ్యక్తి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు.. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. యూజ్‌లెస్ ఫెలోస్ (మీరంతా పనికిమాలిన వాళ్లు). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరిని ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తుంచుకోండి. సభలో కేవలం కొద్దిమంది మాత్రమే అల్లరి చేస్తుంటే, మిగిలిన వారు ఇక్కడికి ఊడ్చడానికి వచ్చారా?. నాకు 58 ఏండ్ల రాజకీయ అనుభవం ఉంది. ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజీ పరిశీలిస్తా. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. గుర్తుంచుకోండి... పార్టీకి క్రమశిక్షణ ఎప్పుడూ అవసరం.` అని మందలించారు.
కాగా, కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేది ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చుకున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు. అయితే ఖర్గే వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans
“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK
— ANI (@ANI) June 21, 2026
సంబంధిత వార్తలు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జూన్ 20, 2026

KTR Adilabad Visit | పంట కొనకపోతే ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ లీడర్ల కాలర్ పట్టుకొని నిలదీయండి : కేటీఆర్ పిలుపు
జూన్ 20, 2026

N Ramchander Rao | నిజమైన ఓటరును తొలగించరు.. ‘సర్’పై ఎన్ రామచందర్ రావు
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు
- ●Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
- ●DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..

Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు

Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు

DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..



