Leema Rose | ఆమె ఆస్తి రూ.1000 కోట్ల పైనే.. తమిళనాడు ఎన్నికల బరిలో సంపన్న అభ్యర్థి
Leema Rose | తమిళనాడులో అత్యంత సంపన్న అభ్యర్థిగా (Richest Candidate) తిరుచ్చి జిల్లా లాల్గుడి (Lalgudi)నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి (AIADMK) లీమా రోస్ మార్టిన్ (Leema Rose) నిలిచారు. ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా వెయ్యి కోట్లకు పైనే.
Leema Rose | త్రినేత్ర.న్యూస్: ప్రస్తుతం ఎన్నికలు (Elections) అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. కోట్లు ఖర్చు చేస్తేగాని గెలువలేని పరిస్థితి. దీంతో సామాన్యులు ఎలక్షన్లలో పోటీ చేయాలంటేనే భయపడిపోతున్నారు. సంపన్నులు మాత్రమే ఎన్నికల బరిలో నిలువగలుగుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో అత్యంత సంపన్న అభ్యర్థిగా (Richest Candidate) తిరుచ్చి జిల్లా లాల్గుడి (Lalgudi)నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి (AIADMK) లీమా రోస్ మార్టిన్ (Leema Rose) నిలిచారు. ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా వెయ్యి కోట్లకు పైనే.
లాటరీ విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన లీమా రోస్.. ఇటీవలే అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నపప్పటికీ, రూ.1,049 కోట్ల ఆస్తులు ఉండటంతో ఆమెకు సులభంగానే పార్టీ టికెట్ లభించింది. దీంతో సోమవారం లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో.. తన పేరుపై 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్లు స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. తన భర్త మార్టిన్ పేరుపై రూ.887.36 కోట్ల విలువైన చరాస్తులు, రూ.3,262 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని, ఆయన పేరున 281 గ్రాముల బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాముల విలువైన ముత్యాలు, కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పేరుపై రూ.655 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.6వేల కోట్లు ఉంటుందని అఫిడవిట్‌లో వెల్లడించారు. తనకు 3 టీఈఎస్ ఎక్స్ఎల్ మోపెడ్లు, క్రెటా, థార్, డిజైర్ కారు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా తన భర్తకు ఎక్సస్ ఎల్ఎక్స్ 570 కారు, బీఎండబ్ల్యూ 530డీ, మారుతీ కారు, కుమారుడు మార్టిన్‌కు 3 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక తమకు కోయంబత్తూర్, మదురై, తిరుచ్చి, తిరుప్పూర్, శివగంగ జిల్లాల్లో స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. తనపై 4 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.9.8 కోట్ల మేర ఆదాయం ఉన్నట్లు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించడం విశేషం. ఆదే కాలానికి ఆమె భర్త ఆదాయం రూ.11.30 కోట్లు, వారి కుమారుడు జోస్ మార్టిన్ వార్షిక ఆదాయం రూ.19.5 కోట్లు కావడం విశేషం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం





