త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించాను : బండి సంజయ్

Bandi Sanjay | పోక్సో కేసులో నా కొడుకును నేనే పోలీసుల‌కు అప్ప‌గించాను అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. కోర్టులో కేసు న‌డుస్తుంది.. విచార‌ణ జ‌రిగి నిజాలు బ‌య‌ట‌కు రావాల‌న్నారు.

S

Telangana | Published On May 20, 2026, 4.21 pm IST

Bandi Sanjay | నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించాను : బండి సంజయ్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : పోక్సో కేసులో నా కొడుకును నేనే పోలీసుల‌కు అప్ప‌గించాను అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. కోర్టులో కేసు న‌డుస్తుంది.. విచార‌ణ జ‌రిగి నిజాలు బ‌య‌ట‌కు రావాల‌న్నారు. బండి సంజ‌య్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

కుమారుడి అరెస్టుపై సంజ‌య్ వ్యాఖ్య‌లు ఇలా..

'కోర్టు ప‌రిధిలో ఉంది.. క‌న్న‌కొడుకును ఓ తండ్రి పోలీసుల‌కు స్వ‌యంగా అప్ప‌గించిన‌టువంటి సంద‌ర్భం ఏదైనా ఉందా..? ఇవాళ క‌న్న కొడుకును నేను తీసుకెళ్లి విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని అప్ప‌జెప్పినా. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్ట‌రీ న‌డుపుతున్నాడు.. ఏం జ‌రుగుత‌ది.. ఏం జ‌ర‌గాలి.. ఏం జ‌రిపించాల‌నేది ఆ కుట్ర‌ల‌న్నీ ఆయ‌న్నే చేస్తున్న‌డు కాబ‌ట్టి ఆయ‌న‌ను అడిగితే స‌మాధానం చెప్త‌డు' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement