Vivek Venkata Swamy | కనీస వేతనాలున్నప్పుడే కార్మికులు సంతోషంగా పని చేస్తారు: మంత్రి వివేక్
Vivek Venkata Swamy | కార్మికులకు కనీస వేతనాలు అందినప్పుడే వారు సంతోషంగా ఉంటారని, మరోవైపు పరిశ్రమలు కూడా బాగా నడుస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
- 1.11 కోట్ల మందికి మేలు జరుగుతుంది
- వచ్చే నెల 1 నుంచి పెంచిన వేతనాలు అందిస్తాం
- మంత్రి వివేక్ వెంకటస్వామి
త్రినేత్ర.న్యూస్: కార్మికులకు కనీస వేతనాలు అందినప్పుడే వారు సంతోషంగా ఉంటారని, మరోవైపు పరిశ్రమలు కూడా బాగా నడుస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిపి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారన్నారు. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
వేతనాలు తక్కువ ఉన్న కార్మికులకు.. వేతనాలు పెంచాలని రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరోజే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం. బీఆర్ఎస్ హయాంలో మినిమం వేతనాలు ఇవ్వలేదు. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచాల్సి ఉంటుంది. వేతనాలు పెంచినప్పుడే కార్మికులు సంతోషంగా పనిచేయగలుగుతారు. వారికి సంతృప్తి ఉన్నప్పుడే పరిశ్రమలు బాగా నడుస్తాయి అని మంత్రి పేర్కొన్నారు.
కమిటీ వేసినప్పుడు చాలా పరిశ్రమల వాళ్లు వచ్చి కనీస వేతనాలు ఉన్నప్పుడే పరిశ్రమలు నడుస్తాయని చెప్పారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నాతో పాటు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో కలిపి కమిటీ వేశారు. ఏదైతే వేతనాలు పెంచాలో వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలగడం సంతోషకరం. మెజారిటీ వర్కర్లు అన్‌స్కిల్ సెగ్మెంట్‌లో ఉన్నారు. సుమారు 75 లక్షల మంది ఈ కేటగిరీలో ఉన్నారు. సెమీ స్కిల్ లో 21 శాతం ఉన్నారు. స్కిల్‌లో 15.64 లక్షల మంది కార్మికులు ఉన్నారు. అందరికీ వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. మరోవైపు పరిశ్రమలు కూడా సంతృప్తి చెందేలా ముందుకు వెళ్తున్నాం అని మంత్రి వెంకటస్వామి వివరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



