త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CNG prices | వాహ‌న‌దారుల‌కు షాక్‌.. మ‌ళ్లీ పెరిగిన‌ సీఎన్‌జీ ధ‌ర‌లు

CNG prices | దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. శ‌నివారం ఉద‌యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచిన చ‌మురు కంపెనీలు సీఎన్‌జీ (CNG prices) వాహ‌న‌దారుల‌పై కూడా భారం మోపాయి.

G

National | Published On May 23, 2026, 9.49 am IST

CNG prices | వాహ‌న‌దారుల‌కు షాక్‌.. మ‌ళ్లీ పెరిగిన‌ సీఎన్‌జీ ధ‌ర‌లు
Advertisement

CNG prices | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. శ‌నివారం ఉద‌యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచిన చ‌మురు కంపెనీలు సీఎన్‌జీ (CNG prices) వాహ‌న‌దారుల‌పై కూడా భారం మోపాయి. పెట్రోల్‌పై 94 పైస‌లు, డీజిల్‌పై 96 పైస‌లు వ‌డ్డించిన కంపెనీలు.. సీఎన్‌జీ కిలో ధ‌ర‌ను రూ.1 పెంచాయి.

తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధ‌ర రూ.81.09కి చేరాయి. ఇక నోయిడా, ఘ‌జియాబాద్‌లో రూ.89.79, హైద‌రాబాద్‌లో రూ.97 గా ఉంది. గ‌త ప‌ది రోజుల్లో గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డం ఇది మూడోసారి. మే 15న రూ.2, ఈ నెల 18న రూ.1 చొప్ప‌న పెంచిన విష‌యం తెలిసిందే.

కాగా, హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోల్ రూ.112.81గా ఉంది. శుక్ర‌వారం నాటి ధ‌ర‌తో పోల్చితే ఇది 97 పైస‌లు అధికం. అదేవిధంగా డీజిల్ 99 పైస‌లు పెరిగి రూ.100.94కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం గ‌త ప‌ది రోజుల్లో ఇది మూడోసారి. మే 15న రూ.3 చొప్పున పెర‌గ‌గా, ఈ నెల 19న పెట్రోల్ 95 పైసలు, డీజిల్ 99 పైస‌ల‌ చొప్పున అధిక‌మ‌య్యాయి.

CNG prices

Advertisement
Advertisement