త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CNG Prices | రెండు రోజుల్లో రెండోసారి.. మ‌ళ్లీ పెరిగిన‌ సీఎన్‌జీ ధరలు

CNG prices | కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే సీఎన్‌జీ ధరలను (CNG prices) మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీ ధరను రూ.1 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

G

National | Published On May 17, 2026, 1.07 pm IST

CNG Prices | రెండు రోజుల్లో రెండోసారి.. మ‌ళ్లీ పెరిగిన‌ సీఎన్‌జీ ధరలు
Advertisement

CNG Prices | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే సీఎన్‌జీ ధరలను (CNG Prices) మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీ ధరను రూ.1 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఆదివారం నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, రెండు రోజుల క్రితమే (మే 15న‌) పెట్రో ధరలతోపాటు సీఎన్‌జీ కూడా రూ.2 వ‌డ్డించిన విష‌యం తెలిసిందే. దీంతో పెంపుతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో స‌మానంగా సీఎన్‌జీపై కూడా రూ.3 పెంచినట్లు అయ్యింది.

తాజాగా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.09కి చేరింది. ముంబైలో రూ. 84.09, నోయిడా, ఘజియాబాద్‌లో రూ. 88.70కి పెరిగింది. ఇక‌ హైదరాబాద్‌లో రూ.100కు చేరుకుంది. కాగా, సీఎన్జీ దొర‌కక‌పోవ‌డంతో గ్యాస్ స్టేష‌న్ల‌లో ఆటోలు, క్యాబ్‌లు పెద్ద సంఖ్య‌లో బారులు తీరుతున్నాయి. దీంతో ఫిల్లింగ్ స్టేష‌న్ల వ‌ద్దే గంట‌ల కొద్ది వేచి ఉంటున్న వాహ‌నాల డ్రైవ‌ర్లు, తాజా ధ‌ర‌ల పెంపుతో మ‌రింత ఇబ్బందులు ప‌డుతున్నారు. ధ‌ర‌లు పెంచుతూ పోతున్న కేంద్ర ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement