Tiruvannamalai | నిషేధం ఉన్నా.. అరుణాచలం కొండ ఎక్కిన నటి.. ఫైన్ వేసిన ఫారెస్ట్ అధికారులు
Tiruvannamalai | తమిళనాడులోని తిరువణ్ణామలైలో (Tiruvannamalai) ఉన్న కొండను దేవుని స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడే తమలో ఎవరు గొప్ప అని పోటీపడుతున్న బ్రహ్మ, విష్ణువుల అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అన్నామలై కొండగా అవతరించాడని భక్తుల విశ్వాసం.
త్రినేత్ర.న్యూస్: తమిళనాడులోని తిరువణ్ణామలైలో (Tiruvannamalai) ఉన్న కొండను దేవుని స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడే తమలో ఎవరు గొప్ప అని పోటీపడుతున్న బ్రహ్మ, విష్ణువుల అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అన్నామలై కొండగా అవతరించాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో అరుణాచలం కొండను ఎక్కడంపై అటవీ అధికారులు నిషేధం విధించారు.
అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక వైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన అన్నామలై కొండపైకి బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ (Archana Ravichandran) అనుమతి లేకుండా ఎక్కారు. అక్కడితో ఆగకుండా అక్కడ ఫొటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అవికాస్తా వైరల్‌వడంతో విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయమై దర్యాప్తు చేపట్టారు. దీంతో నటుడు అరుణ్‌ప్రసాద్‌తో కలిసి అర్చనా రవిచంద్రన్ కొండపైకి వెళ్లి వచ్చారని తెలింది. వారిద్దరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించి, హెచ్చరించి పంపారు.
తిరువణ్ణామలై.. ఆ పేరు ఎందుకొచ్చిందంటే..
తిరువణ్ణామలైని శివుని ఐదు నివాసాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది అగ్ని (అగ్నిస్థల) మూలకాన్ని సూచిస్తుంది. ఇక్కడ కొండే దేవుని స్వరూపం. ఒకసారి బ్రహ్మ, మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి, పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి, ఆ స్తంభం మొదలు కనుగొనడానికి బయలుదేరుతాడు. మరోవైపు హంస రూపాన్ని ధరించిన బ్రహ్మ.. దాని చివరి భాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోతాడు. వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని కనుక్కోలేకపోతారు. పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరూ పూజించారు. అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించాడు. అదే తిరువణ్ణామలై అని పిలువబడే కొండ.
శివుడు పూజ కోసం లింగ రూపాన్ని (లింగం, జ్యోతిని సూచించే చిహ్నం) ధరించాడు. ఇది లింగ ఉద్భవం (లింగోధ్బవ - శివలింగ ఆవిర్భావం) జరిగిన ప్రదేశం అని భక్తులు విశ్వసిస్తారు. తమిళంలో అన్ను అంటే చేరుకోదగినది. అన్నా అంటే చేరుకోలేనిది. మలై అనే పదానికి కేవలం కొండ అని అర్థం. ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు, ఇది అగ్ని స్తంభానికి ప్రతీక. సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు. అచల అంటే కొండ. అరుణాచలం అంటే ఎఱ్ఱని అగ్ని స్తంభం నుంచి వెలువడిన కొండ అని అర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే తమకు అంతా శుభం కలుతుందని భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






