త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 కోసం.. థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

Sanju Samson | లెజెండ‌రీ న‌టుడు ర‌జ‌నీకాంత్ (Rajinikanth)పై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson). త‌లైవా న‌టించిన జైల‌ర్‌-2 (Jailer 2 Movie) కోసం ఏకంగా థియేట‌ర్ మొత్తాన్నే బుక్ చేశారు. త‌న ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో క‌లిసి ర‌జ‌నీకాంత్‌ మూవీని చూసి ఎంజాయ్ చేశారు.

D

Movies | Published On Oct 20, 2026, 1.37 pm IST

Sanju Samson | ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 కోసం.. థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
Advertisement

Sanju Samson | లెజెండ‌రీ న‌టుడు ర‌జ‌నీకాంత్ (Rajinikanth) అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. త‌లైవా సినిమాపై అభిమానులు, సామాన్య ప్ర‌జ‌ల‌తోపాటూ పలువురు ప్ర‌ముఖుల్లో కూడా ఆస‌క్తి ఎక్కువే. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson).. ర‌జ‌నీకాంత్‌పై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు. త‌లైవా జైల‌ర్‌-2 (Jailer 2 Movie) కోసం ఏకంగా థియేట‌ర్ మొత్తాన్నే బుక్ చేశారు.

త‌న ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో క‌లిసి ర‌జ‌నీకాంత్‌ మూవీని చూసి ఎంజాయ్ చేశారు. త‌లైవాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆంద‌నం వ్య‌క్తం చేశారు. ర‌జ‌నీకాంత్ స‌ర్ సినామాలు చూడ‌ట‌మంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని ఈ సంద‌ర్భంగా సంజూ శాంస‌న్ తెలిపారు. ఆయ‌న సినిమా కోసం తాను ఎప్పుడూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటాన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఢిల్లీలో ఓ కార్య‌క్ర‌మం ఉండ‌టం వ‌ల్ల జైల‌ర్‌-2 సినిమా చూడ‌టం ఆల‌స్య‌మైంద‌న్నారు. అదృష్ట‌వ‌శాత్తూ థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేసుకునే అవ‌కాశం త‌న‌కు ల‌భించింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. స్నేహితులు, త‌న భార్య‌, తోటి ఆట‌గాళ్ల‌తో క‌లిసి ర‌జ‌నీ స‌ర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడ‌టం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన జైల‌ర్ 2 మూవీ అక్టోబ‌ర్ 15న తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో రిలీజైన విష‌యం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 2023 బ్లాక్‌బస్టర్ 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా (Jailer Sequel) ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా థియేట‌ర్ల వ‌ద్ద‌ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, మిర్నా మీన‌న్‌, విద్యా బాల‌న్‌, ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్ గెస్ట్ పాత్ర‌ల్లో న‌టించారు.

కాగా జైల‌ర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. ర‌జ‌నీకాంత్ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జైల‌ర్ పెద్ద హిట్ట‌వ‌డం, సీక్వెల్‌లో ర‌జ‌నీకాంత్‌తో పాటు ప‌లువురు స్టార్స్ న‌టించ‌డంతో జైల‌ర్ 2 ఓటీటీ రైట్స్ కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డింది. తెలుగు, త‌మిళంతో పాటు మ‌రో మూడు భాష‌ల్లో క‌లిపి 160 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. న‌వంబ‌ర్ 12న అమెజాన్ ప్రైమ్‌లో జైల‌ర్ 2 విడుద‌ల కావ‌చ్చునంటూ వార్త‌లొస్తున్నాయి.

Also Read..

పార్టీ మార‌గానే.. యూస‌ఫ్ ప‌ఠాన్‌కు బీజేపీ ప్ర‌భుత్వం భారీ గిఫ్ట్‌

ఉగ్ర‌వాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక ప‌రిజ్ఞానం.. ఐరాస వేదిక‌గా భార‌త్ తీవ్ర ఆందోళ‌న‌

జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..

Advertisement
Advertisement