Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
Madhu Goud Yaskhi | ప్రస్తుతం భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని సమాన హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షణ కోసం అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్, చైర్పర్సన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు.
దేశ నిర్మాణంలో ప్రొఫెషనల్స్ పాత్ర చాలా ముఖ్యం
వృత్తి నిపుణుల భాగస్వామ్యంతో ఏఐపీసీని బలోపేతం చేస్తాం
ఏఐపీసీ ప్రొఫెషనల్స్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్య
Madhu Goud Yaskhi | త్రినేత్ర న్యూస్ : ప్రస్తుతం భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని సమాన హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షణ కోసం అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్, చైర్పర్సన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. ఏఐపీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా గాంధీభవన్కు వచ్చిన మధుయాష్కి గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగమే ఈ దేశ ప్రజలందరికీ.. భగద్గీత, బైబిల్, ఖురాన్ లాంటివన్నారు. కానీ 2014లో మోడీ ప్రధాని అయ్యాక రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛను కాలరాస్తున్నారు. రాజ్యాంగ రక్షణ కోసం దేశంలో వివిధ రంగాల్లోని నిపుణులను ఒకే వేదికపై తీసుకురావాలన్న భావనతో 2017లో రాహుల్ గాంధీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పాత్ర కీలకమని, ఇతర పార్టీ లో ఉన్న వారు కూడ ప్రొఫెషనల్ కాంగ్రెస్లో భాగం పంచుకోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం లేని వారు కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం తమతో కలిసి పని చేయాలని కోరారు.
దేశంలో సర్ ద్వారా 13 కోట్ల ఓట్లు మోడీ ప్రభుత్వం తొలగించిందని, ఆ 13 కోట్ల ఓట్లలో ఎక్కువ మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓట్లు ఉన్నాయన్నారు. ఎన్ని ఓట్లు తొలగించారన్నది ఆధారాలతో బయటపెట్టామన్నారు. సర్పై పోరాటం కాంగ్రెస్ భవిష్యత్తు కోసమో.. ప్రతిపక్ష పార్టీల ఉనికి కోసమో కాదని.. దేశ ప్రజల భవిష్యత్, భావితరాల భవిష్యత్ బాగుండాలంటే రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ అవసరమన్నారు. క్లిష్ట సమయంలో, నాకు అప్పజెప్పిన ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.
మనోహ్మన్ సింగ్ ఫెలోషిప్ ద్వారా వివిధ రంగాల్లో వచ్చిన నిష్ణాతులైన వారికి ఒక సంవత్సరం 50 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. రెండో దఫా 800 అప్లికేషన్స్ వచ్చాయి. 100మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు ఇలా వివిధ రంగాల్లోని నిపుణులు ఏఐపీసీలో జాయిన్ కావాలని సూచించారు. మన్మోహన్ సింగ్ ఫెలోస్ రెండో శిక్షణ కార్యక్రమంలో చేరెందుకు ఆసక్తి ఉన్నవారు https://manmohansinghfellows.com ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు.
తాజావార్తలు
- ●Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
- ●Tirumala | పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా మలయప్పస్వామి
- ●Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్కడంటే!
- ●Harish Rao | 7 వేలకే పోలీసు నోటిఫికేషన్.. నిరుద్యోగులను వంచించడమే
- ●Bhu-Aadhaar | ప్రతి భూ కమతానికి 14 అంకెల భూ ఆధార్
- ●Drugs | డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా బైక్ ర్యాలీ

Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక

Tirumala | పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా మలయప్పస్వామి

Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్కడంటే!

Harish Rao | 7 వేలకే పోలీసు నోటిఫికేషన్.. నిరుద్యోగులను వంచించడమే



