Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
దసరా సందర్భంగా అభిమానులకు వెంకటేష్ గుడ్‌న్యూస్ వినిపించారు. ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. అక్టోబర్ 30న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Oct 20, 2026, 1.45 pm IST
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. అక్టోబర్ 30న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ థియేటర్లలోకి రాబోతున్నట్లు హీరో వెంకటేష్ ప్రకటించారు. దసరా సందర్భంగా రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
శ్రీనిధి శెట్టి
ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్‌కు జోడీగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నివేథా పేతురాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. డింపుల్ హయతి స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది. తొలుత ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో అక్టోబర్ 9కి వాయిదాపడింది. ఈ తేదీకి కూడా సినిమాను థియేటర్లలోకి తీసుకురాలేకపోయారు మేకర్స్.
ఆరు చిన్న సినిమాలు
దసరా సందర్భంగా విడుదల తేదీని వెల్లడించారు. ఆదర్శ కుటుంబం థియేటర్లలోకి వస్తే అదే రోజు రిలీజ్ కానున్న ఆరు చిన్న సినిమాల పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వక్‌సేన్ కల్ట్, వెంకీ కుడుముల ఇట్లు అర్జునతో పాటు చంద్రయాన్, సమ్మర్ హాలీడేస్, రోమియో జూలియట్‌తో పాటు అ సినిమాలను అక్టోబర్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయా సినిమాల మేకర్స్ ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.
పోటీగా రిలీజ్
సడెన్‌గా ఆదర్శ కుటుంబం సినిమాను అక్టోబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి చిన్న సినిమాల నిర్మాతలకు వెంకటేష్ అండ్ టీమ్ పెద్ద షాకిచ్చారు. ఆదర్శ కుటుంబం సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వారమే రామాయణ విడుదల కానున్న నేపథ్యంలో చిన్న సినిమాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆదర్శ కుటుంబం సినిమా నుంచి ఇటీవలే రెండు పాటలతో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నారా రోహిత్, యువీనా రాజ్, ప్రజ్వల్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
అక్టోబర్ 20, 2026

Sai Pallavi | బాలీవుడ్ సినిమా అనగానే భయపడ్డా – రామాయణపై సాయిపల్లవి కామెంట్స్
అక్టోబర్ 20, 2026

Rukmini Vasanth | వెండితెరపైకి దిగ్గజ తెలుగు సింగర్ బయోపిక్ – హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
- ●Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
- ●UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..
- ●India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!
- ●JD Vance H1B Visa Remarks | నా అత్తమామలు సౌత్ ఇండియన్సే, వారిని ప్రేమిస్తాను కానీ..!

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్

UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన

Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..



