Domestic Violence | మల్లెపూలతో ఆకర్షిస్తుందని.. భార్యకు గుండు గీసిన భర్త
Domestic Violence | ఓ భర్తకు తన భార్య పొడవాటి జుట్టుకు మల్లెపూలు పెట్టుకోవడం నచ్చలేదు. ఇంకేముంది అర్ధరాత్రి వేళ కొడవలితో బెదిరిస్తూ ఆమెకు గుండు గీసేశాడు. ఈ ఘటన కర్ణాటక( Karnataka )లోని బాగల్‌కోట్ జిల్లా( Bagalkot district )లోని తొదలబాగి గ్రామంలో వెలుగు చూసింది.
Domestic Violence | త్రినేత్ర.న్యూస్ : మహిళల కురులకు మగాళ్లు దాసోహమైపోతారు. ఆ కురుల్లో( Hairs ) అంత అందం ఉంటుంది మరి. పొడవాటి జుట్టుకు మూరెడు మల్లెపూలు( Jasmine ) పెట్టుకుంటే మరింత ఆకర్షణీయంగా, చూడముచ్చటగా కనిపిస్తారు.. పురుషులకు కనువిందు చేస్తుంటారు. అలా చాలా మంది మహిళలు ఆకర్షణీయంగా తయారవుతుంటారు. ఇది కొంత మంది మగాళ్లకు నచ్చుతుంది. కొందరికేమో నచ్చదు.
అయితే ఓ భర్తకు తన భార్య పొడవాటి జుట్టుకు మల్లెపూలు పెట్టుకోవడం నచ్చలేదు. ఇంకేముంది అర్ధరాత్రి వేళ కొడవలితో బెదిరిస్తూ ఆమెకు గుండు గీసేశాడు. ఈ ఘటన కర్ణాటక( Karnataka )లోని బాగల్‌కోట్ జిల్లా( Bagalkot district )లోని తొదలబాగి గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తొదలబాగి గ్రామానికి చెందిన ఉమేశ్(31), లక్ష్మీబాయి(26) కొన్నేండ్ల క్రితం వివాహమైంది. భర్త తాగుడుకు బానిస అయ్యాడు. భార్య ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే ఆమెకు పొడవాటి జుట్టు ఉంది. ఇక ప్రతిరోజు ఆమె జుట్టుకు మల్లెపూలు పెట్టుకోవడం అలవాటుగా చేసుకుంది. ఇలా మల్లెపూలు ధరించడం ఉమేశ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. మల్లెపూలు పెట్టుకోవద్దని ఆమెతో వాదించేవాడు.
మల్లెపూలు ధరించడంతో రగిలిపోయిన భర్త
సోమవారం రాత్రి కూడా లక్ష్మీబాయి మల్లెపూలు ధరించింది. దీంతో ఉమేశ్ రగిలిపోయాడు. మల్లెపూలు పెట్టుకుని పరాయి పురుషులను ఆకర్షిస్తూ, సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఉమేశ్‌కు ఎప్పట్నుంచో ఉంది. మద్యం మత్తులో ఉమేశ్ సహనం కోల్పోయాడు. చెరుకు పంట కోసే పదునైన కొడవలిని తీసుకుని చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత రేజర్‌తో ఆమెకు గుండు గీశాడు. ఇదంతా సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఇరుగుపొరుగు వారు షాక్
తెల్లారేసరికి లక్ష్మీబాయిని ఇరుగుపొరుగు వారు చూసి షాకయ్యారు. ఎందుకు గుండు గీయించుకున్నావంటూ ప్రశ్నలతో చంపేశారు. చేసేదేమీ తన భర్తే అనుమానంతో ఇలా గుండు గీశాడని బోరున విలపించింది లక్ష్మీబాయి.
ఉమేశ్ అరెస్టు
గ్రామస్తులందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు భర్త ఉమేశ్‌ను అరెస్టు చేశారు. విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి





