Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
Dubbaka | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దుబ్బాక (Dubbaka) మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది.
Dubbaka | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దుబ్బాక (Dubbaka) మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2) కారులో బుధవారం అర్ధరాత్రి సిద్దిపేట నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అప్పనపల్లి వద్ద ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నపోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. అందులో నుంచి మృతదేహాలను.. పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు






