Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
Harish Rao | రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి ఆరోపణలు, 22 ఏ దుర్వినియోగం వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivas Reddy) వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన పాలనా సంక్షోభం నెలకొందని విమర్శించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి ఆరోపణలు, 22 ఏ దుర్వినియోగం వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivas Reddy) వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన పాలనా సంక్షోభం నెలకొందని విమర్శించారు. ఈ మరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (RahulGandhi) రాష్ట్రంలో భూవివాదాలు, సెక్షన్ 22ఏ (Section 22A) అవినీతి ఆరోపణలపై బహిరంగ లేఖ రాశారు. అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి ఉద్దేశించిన సెక్షన్ 22Aను.. ప్రైవేట్ ఆస్తులను ఇష్టారాజ్యంగా స్తంభింపజేయడానికి (ఫ్రీజ్) చేయడానికి వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తున్నదని, బినామీ సంస్థల ద్వారా బలవంతంగా 50:50 డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డితోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హెచ్ఎండీఏ (HMDA), జీహెచ్ఎంసీ (GHMC) అనుమతి పొందిన లేఅవుట్లు, ఎప్పటి నుంచో ఉన్న పట్టా భూములతో (Patta Lands) సహా వేలాది ఆస్తులు దీనివల్ల ప్రభావితమయ్యాయని వెల్లడించారు. భూ భారతితో భూ రికార్డుల్లో స్పష్టత తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అది ఇప్పటికే ఖరారైన ఆస్తి హక్కులపై అభద్రతను సృష్టించకూడదని చెప్పారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు. డిసెంబర్ 2023 నుంచి సెక్షన్ 22A జాబితాలో చేర్చిన, అలాగే తొలగించిన అన్ని భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. అవినీతి నిరోధక శాఖతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, అసలైన ఆస్తి యజమానులకు (Bona fide Owners) రక్షణ కల్పించాలన్నారు. జిల్లా వారీగా, సర్వే నంబర్ల వారీగా వివరాలను బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది చట్టబద్ధమైన రక్షణ కవచం, వసూళ్లకు వాడుకునే సాధనం కాదని చెప్పారు.
Dear @RahulGandhi ji a grave governance crisis in Telangana.
Section 22A, meant to safeguard against illegal registrations, is allegedly being used to arbitrarily freeze private properties, with allegations of a “30% collection racket” and coercive 50:50 developments aggrements… pic.twitter.com/gKcTQgXAYj
— Harish Rao Thanneeru (@BRSHarish) August 20, 2026
ఇవికూడా చదవండి..
22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ‘ఫ్రీ లీగల్ సెల్’ : ఫోన్ నెంబర్ ఇదే!
22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






