త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్‌ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ స‌హా ఏడుగురు దుర్మ‌ర‌ణం

Helicopter Crash | కెన్యాలో (Kenya) ఓ స‌ఫారీ హెలికాప్ట‌ర్ (Helicopter Crash) కుప్ప‌కూలింది. దీంతో ఈక్వెడార్ (Ecuador) ఇంటెలిజెన్స్ చీఫ్ దంప‌తులు స‌హా ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

G

International | Published On Aug 20, 2026, 9.58 am IST

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్‌ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ స‌హా ఏడుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Helicopter Crash | త్రినేత్ర‌.న్యూస్‌: కెన్యాలో (Kenya) ఓ స‌ఫారీ హెలికాప్ట‌ర్ (Helicopter Crash) కుప్ప‌కూలింది. దీంతో ఈక్వెడార్ (Ecuador) ఇంటెలిజెన్స్ చీఫ్ దంప‌తులు స‌హా ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఐదుగురు అమెరిక‌న్లు కూడా ఉన్నారు. వైల్డ్‌లైఫ్ సాంక్చువరీని (Wildlife Sanctuary) గాల్లో నుంచి వీక్షిస్తుండ‌గా సంబూర్ కౌంటీలోని (Samburu County) మౌంట్ ఒలోలోక్వే వద్ద హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది.


వైల్డ్‌లైఫ్ సాంక్చువరీని వీక్షించేందుకు ఈక్వెడార్‌ ఇంటెలిజెన్స్ చీఫ్ (Intelligence Chief) మిచెల్ సెన్సి కంటుగి, ఆయ‌న స‌తీమ‌ణి స్టెఫ‌నీ హొలిహ‌న్‌తోపాటు మ‌రో ఐదుగురు అమెరికాకు చెందిన ప‌ర్యాట‌కులు హెలికాప్ట‌ర్‌లో వెళ్తున్నారు. గాలిలో నుంచి అట‌వీ జంతువుల‌ను వీక్షిస్తున్న వీక్షిస్తున్న క్ర‌మంలో సంబూర్ కౌంటీలోని మౌంట్ ఒలోలోక్వే (Mount Ololokwe) ప‌ర్వ‌తం స‌మీపంలో ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున అగ్నికీల‌లు ఎగ‌సిప‌డ్డాయి. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ప్రమాదంలో వారంతా మృతి చెందినట్లు సంబూర్ కౌంటీ పోలీస్ కమాండర్ డేవిడ్ న్కోరో వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతున్న‌ది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ మృతిపై ఈక్వెడార్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు.

Advertisement
Advertisement