త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mother attack on Child | అమానుషం.. చిన్నారిని కాలితో త‌న్నిన త‌ల్లి.. వీడియో

Mother attack on Child | బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సింది పోయి ఆ చిన్నారి ప‌ట్ల‌ ఓ త‌ల్లి క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించింది. అంగ‌న్‌వాడీ కేంద్రానికి వెళ్ల‌న‌ని క‌న్నీరు పెట్టుకున్న ఆ బిడ్డ‌ను త‌ల్లి కాలితో త‌న్ని పైశాచిక ఆనందం పొందింది.

S

National | Published On Jun 26, 2026, 12.41 pm IST

Mother attack on Child | అమానుషం.. చిన్నారిని కాలితో త‌న్నిన త‌ల్లి.. వీడియో
Advertisement

Mother attack on Child | త్రినేత్ర‌.న్యూస్ : బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సింది పోయి ఆ చిన్నారి ప‌ట్ల‌ ఓ త‌ల్లి క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించింది. అంగ‌న్‌వాడీ కేంద్రానికి వెళ్ల‌న‌ని క‌న్నీరు పెట్టుకున్న ఆ బిడ్డ‌ను త‌ల్లి కాలితో త‌న్ని పైశాచిక ఆనందం పొందింది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాయ‌గ‌ఢ్ జిల్లాలోని నంద‌గావ్ గ్రామంలో వెలుగుచూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నంద‌గావ్ గ్రామానికి చెందిన ఓ మ‌హిళ త‌న కుమార్తెను వెంట‌బెట్టుకుని అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌కు వెళ్లింది. అయితే తాను స్కూల్‌కు వెళ్ల‌న‌ని చిన్నారి క‌న్నీరు పెట్టుకుంది. ఆ ప‌సిబిడ్డ‌ను బుజ్జ‌గించాల్సింది పోయి.. ఆమెపై క‌న్నెర్ర జేసింది త‌ల్లింది. అంగ‌న్‌వాడీ సెంట‌ర్ మెట్ల‌పై నిల్చున్న కూతురిని త‌ల్లి కాలితో త‌న్నింది. దీంతో ఆ బిడ్డ ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన అంగ‌న్‌వాడీ టీచ‌ర్ సెంట‌ర్ లోప‌లి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక త‌ల్లిని మందలించ‌కుండా.. న‌వ్వుతూ ఆమె చేయిపై కొట్టి కొట్ట‌న‌ట్టు కొట్టింది టీచ‌ర్. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను స్థానికులు త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. త‌ల్లిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement