త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moon | నేడు ఆకాశంలో అద్భుతం.. క‌నుల విందు చేయ‌నున్న గ్ర‌హాలు

Moon | ఆకాశంలో అరుదైన అద్భుతం చోటు (Rare Miracle in the Sky) చేసుకోనుంది. 36 ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే శ‌ని (శాట‌ర్న్‌) (Saturn) గ్ర‌హంతో పాటు వ‌రణుడు (నెప్ట్యూన్‌) (Neptune) ఒకేసారి క‌నిపించ‌నున్నాయి. చంద్రునితో క‌లిసి ఈ గ్ర‌హాలు స్మైలీ (హాస్య ముఖం) ఆకారంలో అల‌రించ‌నున్నాయి.

A

National | Published On Jan 23, 2026, 1.43 pm IST

Moon | నేడు ఆకాశంలో అద్భుతం.. క‌నుల విందు చేయ‌నున్న గ్ర‌హాలు
Advertisement

Moon | త్రినేత్ర‌.న్యూస్ : ఆకాశంలో అరుదైన అద్భుతం చోటు (Rare Miracle in the Sky) చేసుకోనుంది. అంత‌రిక్షంలో సాధార‌ణంగా ఎప్పుడూ క‌నిపించ‌ని గ్ర‌హాల్లో రెండు శుక్ర‌వారం రాత్రి స‌మ‌యంలో క‌నువిందు చేయ‌నున్నాయి. ఇది ప్ర‌తి 36 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి క‌నిపించ‌నుంది. శ‌ని (శాట‌ర్న్‌) (Saturn) గ్ర‌హంతో పాటు వ‌రణుడు (నెప్ట్యూన్‌) (Neptune) గ్ర‌హాలు ఒకేసారి క‌నిపించ‌నున్నాయి. చంద్రుని (Moon) తో క‌లిసి ఈ గ్ర‌హాలు స్మైలీ (హాస్య ముఖం) ఆకారంలో అల‌రించ‌నున్నాయి. అమావాస్య త‌రువాత చంద్రుడు క్ర‌మేణా పెరుగుతూ ఉండ‌డంతో చిరున‌వ్వు ఆకారంలో చంద్రుడు.. ఆ పైన రెండు క‌ళ్ల ఆకారంలో శ‌ని, వ‌రుణ గ్ర‌హాలు చెరో దిక్కు కనిపించ‌నున్నాయి.

సాధార‌ణంగా దీనిని ఏ ప‌రిక‌రాల అవ‌స‌రం లేకుండా చూడ‌డం కొంచెం క‌ష్ట‌మే. సూర్యాస్తమయం తర్వాత పడికట్టు దిశలో కనుగొనండి, శని చంద్రుడి క్రింద ప్రకాశిస్తూ కనిపిస్తుంది, నెప్ట్యూన్ దాదాపు కనిపించనంత బలహీనంగా ఉంటుంది. ప‌రిశీలించి చూస్తే త‌ప్ప దానిని గ‌మ‌నించ‌లేం. ఇది స్ప‌ష్టంగా చూసేందుకు ఏదైనా టెలిస్కోప్ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఇది కంజంక్ష‌న్ కార‌ణంగా ఏర్ప‌డుతుంది. ఖ‌గోళ శాస్త్రంలో కంజంక్ష‌న్ అనేది ఏవైనా క‌నీసం రెండు లేదా అంత‌కంటే ఎక్కువ గ్ర‌హాలు ఒకే రేఖాంశంలో స‌మీపంలో క‌నిపించే సాధార‌ణ ఘ‌ట్టం. కానీ నేటి రాత్రి జ‌ర‌గ‌బోయేది కొంత ప్ర‌త్యేక‌మైన‌ది, శ‌ని, వ‌రుణ గ్ర‌హాల‌తో పాటు స‌మీపంలోనే చంద్రుడు కూడా ఉండ‌డంతో ఈ అరుదైన స్మైలీ ఏర్ప‌డ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement