US midterm elections | ట్రంప్‌నకు మిడ్ టర్మ్ షాక్.. సెనేట్, ప్రతినిధుల సభ విపక్షాల వశం..
US midterm elections | అమెరికా మధ్యంతర ఎన్నికల (Midterm Elections) ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రిపబ్లికన్ పార్టీకి (Republican Party) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాట్లు (Democrats) అద్భుత విజయం సాధించి యూఎస్ సెనేట్ (US Senate), ప్రతినిధుల సభ (House of Representatives) రెండింటిపై పూర్తి నియంత్రణను సాధించారు.
International | Published On Nov 4, 2026, 11.31 am IST
- రిపబ్లికన్ల కంచుకోటను బద్దలు కొట్టిన డెమోక్రాట్లు
- సత్తా చాటిన భారతీయులు..
- వివేక్ రామస్వామికి ఎదురుదెబ్బ
US midterm elections | త్రినేత్ర న్యూస్ : అమెరికా మధ్యంతర ఎన్నికల (Midterm Elections) ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రిపబ్లికన్ పార్టీకి (Republican Party) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాట్లు (Democrats) అద్భుత విజయం సాధించి యూఎస్ సెనేట్ (US Senate), ప్రతినిధుల సభ (House of Representatives) రెండింటిపై పూర్తి నియంత్రణను సాధించారు. రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, టెక్సాస్, కాన్సాస్, అయోవా, ఒహియో వంటి కీలక రాష్ట్రాల్లోని సెనేట్ స్థానాలను డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు.
టెక్సాస్ యూఎస్ సెనేట్ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జేమ్స్ టాలరికో (James Talarico) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ (Ken Paxton)పై ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక్కడ 1994 తర్వాత అంటే 32 ఏళ్లలో డెమోక్రాట్స్ విజయం సాధించడం ఇదే తొలిసారి. అటు కాన్సాస్ యూఎస్ సెనేట్ స్థానంలో డెమోక్రాట్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ ఘన విజయం సాధించి.. గత 94 ఏళ్లలో ఆ స్థానాన్ని గెలుచుకున్న మొదటి డెమోక్రాట్‌గా రికార్డు సృష్టించారు.
డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత అధ్యక్ష పదవిలో తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, టారిఫ్‌లు, ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఓటర్లు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. తాజా ఫలితాలు ట్రంప్ స్వయంగా ప్రచారం నిర్వహించిన రాష్ట్రాల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థులు ఓటమి పాలవడం ట్రంప్ నాయకత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నాయి.
సత్తా చాటిన భారతీయులు
- ఇక ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సుహాస్ సుబ్రమణ్యం (Suhas Subramanyam) మరోసారి ప్రతినిధుల సభకు (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్రంలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌పై ఆయన విజయం సాధించారు. సుహాస్‌కు 61.5 శాతానికిపైగా ఓట్లు రాగా, ప్రత్యర్థికి 36.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2024లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన సుహాస్ తాజా విజయంతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
- భారత సంతతికే చెందిన పియా దాండియా (Pia Dandiya) ఫ్లోరిడా నుంచి తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి 51.9 శాతం ఓట్లు సాధించి రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌పై (49.1 శాతం) విజయం సాధించారు. దీంతో ఫ్లోరిడా నుంచి అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ కూడా తన పదవిని నిలబెట్టుకున్నారు.
- అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు పోటీగా నిలబడి చివరి నిమిషంలో రేసు నుంచి తప్పుకున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒహియో గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామస్వామి.. అక్కడ డెమోక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఏకంగా రెండు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. వైద్యురాలైన అమీ ఆక్టన్ గతంలో ఒహియో ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రజల జీవన వ్యయం, ఆర్థిక పరిస్థితులు, పాలనా అంశాలను ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. చివరకు ఆమె విజయం సాధించడంతో 2006 తర్వాత తొలిసారిగా ఒహియోలో డెమోక్రాటిక్ పార్టీకి గవర్నర్ పదవి దక్కినట్లైంది.
- ఇక రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా వంటి భారత సంతతి అబ్యర్థులు కూడా తిరిగి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యేందుకు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న నేతల ప్రాతినిధ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికలు
అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, 100 మంది సభ్యులున్న సెనెట్‌లోని సెనేట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎగువ సభలో ఇప్పటికే 34 మంది డెమోక్రాట్లు, 31 మంది రిపబ్లికన్లు ఉన్నారు. మిగతా 35 స్థానాలకు మిడ్ టర్మ్‌లో పోలింగ్ జరిగింది. సెనేట్‌లో మెజారిటీ సాధించడానికి కనీసం 51 స్థానాలు అవసరం కాగా, డెమొక్రాట్లు ఆ మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యతను సాధించారు. వీటితోపాటూ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలకు గానూ 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. చివరికి డెమోక్రాట్లకు 241 హౌస్ స్థానాలు, రిపబ్లికన్లకు 194 స్థానాలు దక్కవచ్చని, అలాగే సెనేట్‌లో 52-48 తేడాతో స్వల్ప ఆధిక్యత లభిస్తుందని 'డిసిషన్ డెస్క్ హెచ్‌క్యూ' తన తుది అంచనాలో వెల్లడించింది. తాజా పరిణామాలను అమెరికా రాజకీయ వర్గాలు ‘బ్లూ సునామీ’గా అభివర్ణిస్తున్నాయి.
Also Read..
ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..
నిరీక్షణకు తెర.. రెండు నెలల తర్వాత తల్లిదండ్రుల చెంతకు మూడేండ్ల బాలుడు
పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి: కవిత
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చరిత్ర సృష్టించిన పియా దాండియా
నవంబర్ 4, 2026

Donald Trump | 10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్
నవంబర్ 1, 2026

Lula da Silva | బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Vande Bharat Sleeper vs Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా వందే భారత్ స్లీపర్.. వేగం, సౌకర్యాలు, టికెట్ ధరల్లో ఏది బెస్ట్?
- ●Kavitha | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి: కవిత
- ●Stock Markets | ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..
- ●US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చరిత్ర సృష్టించిన పియా దాండియా
- ●Gen Z Shopping Trends | గ్రామీణ యువత షాపింగ్ ట్రెండ్ మారింది.. కొనుగోళ్లలో ఏఐ, సోషల్ మీడియా హవా!
- ●MBBS Seats | ఫీజుల భారం.. రాష్ట్రంలో ఖాళీగా 175 ఎంబీబీఎస్ సీట్లు

Vande Bharat Sleeper vs Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా వందే భారత్ స్లీపర్.. వేగం, సౌకర్యాలు, టికెట్ ధరల్లో ఏది బెస్ట్?

Kavitha | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి: కవిత

Stock Markets | ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చరిత్ర సృష్టించిన పియా దాండియా



