Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో జోరు.. పసిడి కొనుగోళ్లకు సైతం మొగ్గు..
Gold And Silver Prices Today | దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లకు సైతం జోష్ వచ్చింది. పసిడి, వెండి కొనుగోళ్లకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయా లోహాల ధరలు సైతం పెరుగుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో పసిడి ధర బుధవారం ఔన్స్‌కు 0.12 శాతం పెరిగి 3,935 డాలర్లకు చేరగా, వెండి ధర ఏకంగా 3.32 శాతం ఎగబాకి 51 డాలర్లకు చేరింది.
Gold And Silver Prices Today | దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లకు సైతం జోష్ వచ్చింది. పసిడి, వెండి కొనుగోళ్లకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయా లోహాల ధరలు సైతం పెరుగుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో పసిడి ధర బుధవారం ఔన్స్‌కు 0.12 శాతం పెరిగి 3,935 డాలర్లకు చేరగా, వెండి ధర ఏకంగా 3.32 శాతం ఎగబాకి 51 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 734 పాయింట్లు పెరిగి 1,40,186కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,081 పాయింట్లు పెరిగి 1,83,779కి చేరింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,991 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,928 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,910 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.13,99,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,825 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,02,600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,28,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,82,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,493 ఉండగా, 8 గ్రాముల ధర రూ.83,944గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,04,930 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,49,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,00,000 ఉండగా, తులం ధర రూ.2,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,00,000 ఉండగా, తులం ధర రూ.2,000 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్
- ●US midterm elections | ట్రంప్‌నకు మిడ్ టర్మ్ షాక్.. సెనేట్, ప్రతినిధుల సభ విపక్షాల వశం..
- ●Vande Bharat Sleeper vs Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా వందే భారత్ స్లీపర్.. వేగం, సౌకర్యాలు, టికెట్ ధరల్లో ఏది బెస్ట్?
- ●Kavitha | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి: కవిత
- ●Stock Markets | ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..
- ●US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చరిత్ర సృష్టించిన పియా దాండియా

Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్

US midterm elections | ట్రంప్‌నకు మిడ్ టర్మ్ షాక్.. సెనేట్, ప్రతినిధుల సభ విపక్షాల వశం..

Vande Bharat Sleeper vs Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా వందే భారత్ స్లీపర్.. వేగం, సౌకర్యాలు, టికెట్ ధరల్లో ఏది బెస్ట్?

Kavitha | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి: కవిత






