Cyber Crime | ఢిల్లీలో ఘరానా మోసం.. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతుల నుంచి 15 కోట్లు లూటీ
Cyber Crime | ఢిల్లీ (Delhi)లో ఘరానా మోసం (Cyber Crime) చోటు చేసుకుంది. ఓ వృద్ధ వైద్య దంపతులు జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న రూ.14.85 కోట్లను సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) లూటీ చేశారు. అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (United Nations Organisation)లో పనిచేసి, పదవీ విరమణ పొందిన డాక్టర్ ఓం తనేజా (Om Taneja), డాక్టర్ ఇందిరా తనేజా (Indira Taneja) దంపతులు 2015లో పదవీ విరమణ అనంతరం ఢిల్లీలో స్థిరపడి సైబర్ నేరగాళ్లకు చిక్కారు.
Cyber Crime | త్రినేత్ర.న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘరానా మోసం (Cyber Crime) చోటు చేసుకుంది. ఓ వృద్ధ వైద్య దంపతులు జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న రూ.14.85 కోట్లను సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) లూటీ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వలవేసిన మోసగాళ్ల దెబ్బకు ఆ వృద్ధులు బలయ్యారు. 17 రోజుల పాటు భయం, ఒత్తిడి మధ్య ఇంటి నుంచి కదలకుండా ఉండి, భారీ మొత్తంలో నష్టపోయారు. ఈ ఘాతుకంలో బలైంది 48 ఏళ్ల సుదీర్ఘ సమయం అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (United Nations Organisation)లో పనిచేసి, పదవీ విరమణ పొందిన డాక్టర్ ఓం తనేజా (Om Taneja), డాక్టర్ ఇందిరా తనేజా (Indira Taneja) దంపతులు. 2015లో పదవీ విరమణ చేసిన అనంతరం ఢిల్లీకి తిరిగి వచ్చి గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారి పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు.
డిసెంబర్ 24న వారికి ఊహించని కాల్ ఒకటి వచ్చింది. “మీ నంబర్ నుంచి అసభ్య వీడియోలు, కాల్స్ పంపారట, 26 ఫిర్యాదులు! మనీలాండరింగ్ కేసు, FIRలు.. అరెస్ట్ వారెంట్ జారీ!” అని గట్టిగా చెప్పాడు ఆ వ్యక్తి. ఇందిరా తనేజా మనసు తడబడింది. ఎవరితో మాట్లాడాలో, ఎవరిని నమ్మాలో తెలియని సందిగ్ధ స్థితిలో పడిపోయింది. అంతలోనే ట్రాయ్ అధికారి, ఢిల్లీ పోలీస్, సీబీఐ అని మరికొన్ని కాల్స్ వచ్చాయి. ఇంట్లోనే ఉండాలి.. బయటకు వెళ్తే అరెస్టు అని బెదిరించారు. వీడియో కాల్స్‌లో 24 గంటలు ఆన్‌లైన్‌లోనే ఉంచారు. బాత్రూమ్‌కు వెళ్లినా కాల్ కట్ చేయలేదు. ఇలా భయం భయంగా నిద్రలేని రాత్రులు గడిపారు.
నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించారు. వీడియో కాల్‌లో ఉంటూనే ఇందిరా తనేజా బ్యాంకుకు వెళ్లి ఆర్‌టీజీఎస్ ద్వారా ఒకసారి రూ.రెండు కోట్లు, మరోసారి రూ.2.1 కోట్లు, ఇలా మొత్తం ఎనిమిది ఖాతాలకు విడతలవారీగా రూ.14.85 కోట్లు బదిలీ చేశారు. ఈ నెల 10న ఆ సొమ్మును తిరిగి తీసుకునేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. వీడియా కాల్‌లోనే ఉండి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె ఫోన్ మాట్లాడమని అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి ఫోన్ అందజేసింది. ఫోన్‌లో మాట్లాడుతున్న అవతలి వ్యక్తి పోలీసులు దూషించాడు. అప్పుడు తాము మోసపోయినట్లు అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ కేసు దర్యాప్తు చేపట్టింది.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



