JD Lakshmi Narayana | రూ. 2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య..!
JD Lakshmi Narayana | సామాన్యులే కాదు.. చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. కోట్ల రూపాయాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
JD Lakshmi Narayana | త్రినేత్ర.న్యూస్ : సామాన్యులే కాదు.. చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. కోట్ల రూపాయాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో ఊర్మిళ నుంచి రూ.2.58 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిళ వాట్సప్‌కు సైబర్ క్రిమినల్స్ మెసేజ్ పంపారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500 శాతం లాభాలు వస్తాయని దినేష్ సింగ్ అనే వ్యక్తి నమ్మించాడు. దినేష్ సింగ్ మెసేజ్స్‌ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని ప్రియసఖి అనే ఓ సభ్యురాలు గ్రూప్‌లో స్క్రీన్ షాట్లు పెట్టింది.
దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుండి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్లు బదిలీ చేసింది ఊర్మిళ. ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా పెట్టింది. యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. అయితే ప్రియసఖి అనే సభ్యురాలు దినేష్ సింగ్ ప్రియురాలు అని తేలింది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



