త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

All India Pregnant Job | పిల్లలు లేని మహిళలను తల్లిని చేస్తే 10 లక్షల రివార్డు.. ఫేక్ గ్యాంగ్ గుట్టు రట్టు

నవాడాకు చెందిన ఈ గ్యాంగ్ మెయిన్ లీడర్ అయిన రంజన్ కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇలాంటి సైబర్ నేరాలను నవాడా జిల్లాలో వెలుగులోకి తీసుకొచ్చామన్నారు.

J

National | Published On Jan 11, 2026, 6.56 pm IST

All India Pregnant Job | పిల్లలు లేని మహిళలను తల్లిని చేస్తే 10 లక్షల రివార్డు.. ఫేక్ గ్యాంగ్ గుట్టు రట్టు
Advertisement

All India Pregnant Job | ఈరోజుల్లో పిల్లలు కలగని దంపతులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం నేటి యువతరం అవలంబిస్తున్న జీవన విధానం కావచ్చు.. తీసుకునే ఆహారం కావచ్చు.. ఇలా పలు కారణాల వల్ల చాలామందికి పిల్లలు పుట్టడం లేదు. పిల్లల కోసం చాలామంది మహిళలు ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కడం లేదు. దీన్నే చాన్స్‌గా తీసుకున్న ఓ గ్యాంగ్.. పిల్లలు లేని యువతులను తల్లిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని యువకులకు గాలం వేసింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి మరీ యువకులను ఇందులోకి లాగింది.

మహిళలను ప్రెగ్నెంట్ చేస్తే డబ్బులు కూడా ఇస్తాం అనే సరికి యువకులు టెంప్ట్ అయిపోయారు. వెంటనే ఆ యాడ్స్‌కి రెస్పాండ్ అయ్యారు. అయితే.. ఈ ఆఫర్ దక్కాలంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని.. ఆ తర్వాత యువతులను హోటల్‌కి తీసుకెళ్లేందుకు డబ్బులు కట్టాలని, ఆ తర్వాత ఇంకేదో ఫీజు కట్టాలని ఇలా అమాయకపు యువకుల నుంచి లక్షల డబ్బును వసూలు చేసింది గ్యాంగ్. ఆ తర్వాత కానీ అర్థం కాలేదు ఇదంతా ఉత్తదే ఫేక్ అని. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు.

బీహార్‌లోని నవాడా సైబర్ పోలీసులు ఈ గ్యాంగ్‌ని పట్టుకున్నారు. యువతులను తల్లిని చేయాలి, లోన్స్ ఇస్తాం, జాబ్స్ ఇస్తాం అంటూ పలు రకాల సోషల్ మీడియా యాడ్స్‌తో యువతను బోల్తా కొట్టించి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఫీజులంటూ వాళ్ల దగ్గర్నుంచి డబ్బులు లాగడమే ఈ గ్యాంగ్ చేసే పని.

నవాడాకు చెందిన ఈ గ్యాంగ్ మెయిన్ లీడర్ అయిన రంజన్ కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇలాంటి సైబర్ నేరాలను నవాడా జిల్లాలో వెలుగులోకి తీసుకొచ్చామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement