Gold-Silver Rate | సరికొత్త గరిష్టాలకు బంగారం, వెండి ధరలు.. ఒకే రోజు రూ.7వేలు పెరిగిన వెండి..!
Gold-Silver Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ఉద్రిక్త పరిస్థితులు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ నేపథ్యంలో ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో వెండి కిలో రూ.2.51లక్షల మార్క్‌ని దాటింది.
Gold-Silver Rate | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ఉద్రిక్త పరిస్థితులు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ నేపథ్యంలో ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో వెండి కిలో రూ.2.51లక్షల మార్క్‌ని దాటింది. అదే సమయంలో పసిడి సైతం తులానికి రూ.1,41,500 చేరుకొని సరికొత్తగా గరిష్టానికి చేరింది. సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. దీనికి తోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరి నేపథ్యంలో మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ డేటా ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.7వేలు పెరింది. కిలో ధర రూ.2.51లక్షలకు చేరుకొని రికార్డు స్థాయికి చేరింది. వరుసగా మూడు సెషన్లలో రేటు పెరింది. గత సెషన్‌లో కిలోకు రూ.2.44లక్షలు పలికింది. ఇక బంగారం వరుసగా నాలుగో రోజు పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.1,100 పెరిగి తులానికి రూ.1,41,500కి పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఫిబ్రవరి కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.56 శాతం పెరిగి ఔన్సుకు 4,476.4 డాలర్లకు చేరింది. మార్చి డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్‌లో సైతం పెట్టుబడిదారులు కొనుగోళ్లు జరిపారు. 2.34 శాతం పెరిగి ఔన్సుకు 78.45 డాలర్లకు చేరాయి. వెనిజులాలో రాజకీయ గందరగోళం మధ్య బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది.
బంగారం ఔన్సుకు 4,450 డాలర్ల కంటే పైకి పెరిగి.. వరుసగా మూడవ సెషన్‌లో కూడా లాభాలను కొనసాగించాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) రాహుల్ కలంత్రి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణాపై కొలంబియా, క్యూబా, మెక్సికో దేశాలకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై మరింత ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. అదే సమయంలో మదురో ఆస్తులను స్విస్ బ్యాంకులు జప్తు చేశాయన్న ఊహాగానాలు సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని చెప్పారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






