త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirmala Sitharaman | నిర్మ‌ల‌మ్మ ‘బ‌డ్జెట్’ శారీస్‌.. నేడు ఏ రంగు చీర ధ‌రించేనో..!

Nirmala Sitharaman | నిర్మ‌లా సీతారామ‌న్( Nirmala Sitharaman ) అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఆవిడ ఈ దేశ ఆర్థిక మంత్రి( Finance Minister ). వ‌రుస‌గా తొమ్మిదో సారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. అయితే బ‌డ్జెట్( Budget ) ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌తీసారి నిర్మ‌లమ్మ ప్ర‌త్యేకతతో కూడిన చీర‌( Saree )ను ధ‌రించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. మ‌రి నేడు ఆమె ధ‌రించే చీర ప్ర‌త్యేక‌త ఏంటో..?

S

National | Published On Feb 1, 2026, 3.00 am IST

Nirmala Sitharaman | నిర్మ‌ల‌మ్మ ‘బ‌డ్జెట్’ శారీస్‌.. నేడు ఏ రంగు చీర ధ‌రించేనో..!
Advertisement

Nirmala Sitharaman | త్రినేత్ర‌.న్యూస్ : 2026-27 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌( Budget )ను నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) వరుసగా తొమ్మిదోసారి పార్లమెంట్‌( Parliament )లో బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని చ‌దివి వినిపించ‌నున్నారు. అయితే నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌తి ఏడాది బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే సంద‌ర్భంగా, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే విధంగా, బ‌డ్జెట్‌కు ప్ర‌తీక‌గా ఆమె చీర( Saree ) ధ‌రిస్తూ వ‌స్తున్నారు. ఆమె ధ‌రించే చీర‌కు ప్ర‌త్యేక‌త కూడా ఉంటుంది. ఇక 2026-27 బ‌డ్జెట్ సంద‌ర్భంగా నిర్మ‌ల‌మ్మ ఏ రంగు చీర ధ‌రించి పార్ల‌మెంట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతార‌నే అంశంపై ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి ఆ చీర‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌త ఉందో తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

గ‌త బ‌డ్జెట్‌ల‌లో నిర్మ‌ల‌మ్మ ధ‌రించిన చీర‌లు ఇవే..

2019లో మంగ‌ళ‌గిరి గులాబీ రంగు చీర

2019లో మంగ‌ళ‌గిరి గులాబీ రంగు చీర క‌ట్టుకున్నారు. ఆ స‌మ‌యంలో బ‌డ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్ స్థానంలో బ‌హీ ఖాతాతో మీడియా ముందుకు వ‌చ్చారు. ఇక ఆ ఏడాది నుంచి గ‌తేడాది బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వ‌ర‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం చ‌ద‌వ‌బోయే రోజు తాను ధ‌రించే చీర విష‌యంలో ప్ర‌త్యేక‌త ఉండేలా చూసుకుంటున్నారు.

2020లో నీలం రంగు అంచులో ప‌సుపు ప‌చ్చ - బంగారు వ‌ర్ణం

2020లో నీలం రంగు అంచులో ప‌సుపు ప‌చ్చ - బంగారు వ‌ర్ణంలో ఉన్న చీర‌క‌ట్టులో నిర్మ‌ల‌మ్మ మెరిసిపోయారు. ఈ రంగు శ్రేయ‌స్సు, స‌మృద్ధిని సూచిస్తుంది. అలాగే ఆస్పిరేష‌న‌ల్ ఇండియా థీమ్‌కు అనుగుణంగా దీనిని ధ‌రించారు.

2021లో భూదాన్ పోచంప‌ల్లి చీర‌

2021లో ఎరుపు గోధుమ రంగు క‌ల‌గ‌లిసిన భూదాన్ పోచంప‌ల్లి చీర‌లో క‌నిపించారు. తెలంగాణ‌కు చెందిన ఈ పోచంప‌ల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.

2022లో ఒడిశాకు చెందిన చేనేత చీర‌

2022లో మెరూన్ రంగు చీర‌ను ధ‌రించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీర‌నే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా క‌నిపించారు. ఇది ఆమె నిరాడంబ‌ర‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

2023లో బ్రౌన్ రంగు

2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డ‌ర్‌లో ఉన్న ప్ర‌కాశవంత‌మైన ఎరుపు చీర‌తో క‌నిపించారు.

2024లో ట‌స్స‌ర్ ప‌ట్టు చేనేత చీర‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు 2024 ఫిబ్ర‌వ‌రి 1న ప్ర‌వేశ‌పెట్టిన తాత్కాలిక బ‌డ్జెట్ స‌మ‌యంలో కాంతా చీర‌లో క‌ళ‌గా ఆమె క‌నిపించారు. అయోధ్యలో బాల‌రాముడి విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు ప్ర‌తీక‌గా రామా బ్లూ రంగు చీర ధ‌రించారు. ఈ ట‌స్స‌ర్ ప‌ట్టు చేనేత చీర‌పై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్ర‌తిబింబించే ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ ఉంది.

గ‌త ఏడాది మెజెంటా బోర్డ‌ర్ క‌ల‌గ‌లిపిన చీర‌లో

గ‌త ఏడాది ఎన్నిక‌ల అనంత‌రం జులై నెల‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ స‌మ‌యంలో తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌ల‌తో ఉన్న మెజెంటా బోర్డ‌ర్ క‌ల‌గ‌లిపిన చీర‌లో నిర్మ‌లా సీతారామ‌న్ క‌నిపించారు.

Advertisement
Advertisement