Uttar Pradesh | భర్త ముక్కు కొరికాడని.. భార్య ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది
Uttar Pradesh | భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఇరువురు కొరుక్కునే దాకా దారి తీసింది. భర్త ముక్కు కొరికాడని.. భార్య అతని ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది.
Uttar Pradesh | త్రినేత్ర.న్యూస్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఇరువురు కొరుక్కునే దాకా దారి తీసింది. భర్త ముక్కు కొరికాడని.. భార్య అతని ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్దోయ్ జిల్లాకు చెందిన దీపక్, సాధన(27)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. అయితే దీపక్ ఫ్రెండ్‌తో సాధనకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో నెలన్నర క్రితం సాధన తన బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది. ఇక పిల్లలను తీసుకువెళ్లేందుకు గురువారం అర్థరాత్రి.. దీపక్ ఇంట్లోకి ప్రవేశించింది. సాధన కదలికలను గమనించిన దీపక్ అప్రమత్తమయ్యాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
నా ముక్కును కొరికేశాడు..
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సాధన తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. దీపక్ తన ముక్కు కొరికాడని భార్య ఆరోపించింది. ఆ సమయంలో అత్తమామలు తన చేతులను, కాళ్లను గట్టిగా పట్టుకున్నారని వాపోయింది. ముక్కును స్థానికంగా ఉన్న డ్రైనేజీలో పడేశాడని ఆమె తెలిపింది.
లేదు లేదు.. నా కుమారుడి ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది..
కోడలు మాటలు విన్న తర్వాత దీపక్ తల్లి సంచలన ఆరోపణలు చేసింది. లేదు లేదు.. ఆమెనే తన కుమారుడి ప్రయివేటు పార్ట్స్ కొరికేసింది. ఆ తర్వాత తలను నేలకేసి బాదుకుంది. దీంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయమై తెగిపోయిందని దీపక్ తల్లి ఆరోపించింది.
ఆస్పత్రికి తరలింపు
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సాధనను స్థానికంగా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు పోలీసులు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హార్దోయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కేసు నమోదు
దీపక్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాధన నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని స్పష్టం చేశారు పోలీసులు.
సంబంధిత వార్తలు

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
సెప్టెంబర్ 4, 2026

Pilgrims | స్టేషనరీ ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు భక్తులు దుర్మరణం
సెప్టెంబర్ 2, 2026

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Karimnagar | కరీంనగర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ
- ●Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో
- ●Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో
- ●Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన
- ●DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు

Karimnagar | కరీంనగర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ

Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో

Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో

Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు



