త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DOST | డిగ్రీలో ఇంకా 2.50 ల‌క్ష‌ల సీట్లు ఖాళీ.. త్వ‌ర‌లోనే స్పాట్ అడ్మిష‌న్లు

DOST | రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో దోస్త్( DOST ) ద్వారా అడ్మిషన్ల ప్ర‌క్రియ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల మంది విద్యార్థులు.. డిగ్రీలో ఆయా కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందారు.

S

Telangana | Published On Sep 20, 2026, 6.33 am IST

DOST | డిగ్రీలో ఇంకా 2.50 ల‌క్ష‌ల సీట్లు ఖాళీ.. త్వ‌ర‌లోనే స్పాట్ అడ్మిష‌న్లు
Advertisement

DOST | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్ర‌క్రియ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల మంది విద్యార్థులు.. డిగ్రీలో ఆయా కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందారు. ఇంకా 2.50 ల‌క్ష‌ల సీట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో స్పాట్ అడ్మిష‌న్ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కోరింది. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత ఫైల్‌పై సంత‌కం చేశారు. అయితే ఈ స్పాట్ అడ్మిష‌న్ల‌లో గ‌తేడాది మాదిరిగానే స్థానికేత‌రుల‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. స్పాట్ అడ్మిష‌న్ల‌కు ఈ వారంలోనే షెడ్యూల్ విడుద‌ల కానుంది.

Advertisement
Advertisement