త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karimnagar | క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ

Karimnagar | రోజురోజుకు దోపిడీ దొంగ‌లు రెచ్చిపోతున్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఒకే రోజు రెండు ఏటీఎంల్లో చోరీకి పాల్ప‌డ్డారు.

S

Telangana | Published On Sep 20, 2026, 8.32 am IST

Karimnagar | క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ
Advertisement

Karimnagar | త్రినేత్ర‌.న్యూస్ : రోజురోజుకు దోపిడీ దొంగ‌లు రెచ్చిపోతున్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఒకే రోజు రెండు ఏటీఎంల్లో చోరీకి పాల్ప‌డ్డారు. దుర్శేడు, తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన ఏటీఎంల్లోకి దొంగ‌లు శ‌నివారం అర్ధ‌రాత్రి ప్ర‌వేశించారు. మొద‌ట‌గా సీసీటీవీ కెమెరాల‌పై స్ప్రే చ‌ల్లారు. అనంత‌రం ఏటీఎంల‌ను ధ్వంసం చేసి.. న‌గ‌దు దోచుకున్నారు. ఈ చోరీ గ్యాంగ్‌లో ఒక మ‌హిళ ఉన్న‌ట్లు తేలింది. దొంగ‌లు త‌ల‌కు టోపీ, క‌ళ్ల‌ద్దాలు, ముసుగు ధ‌రించిన‌ట్లు తిమ్మాపూర్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

Advertisement
Advertisement