త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | శ్వాస‌నాళంలో ఇరుక్కున్న ‘విట‌మిన్ బీ’ మాత్ర‌.. తొల‌గించిన వైద్యులు

Hyderabad | ఓ 75 ఏళ్ల వృద్ధుడు గ‌త కొద్ది రోజుల నుంచి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నాడు. ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉండ‌డంతో చేసేదేమీ లేక చివ‌ర‌కు నాన‌క్‌రాంగూడ‌లోని స్టార్ హాస్పిట‌ల్ వైద్యుల‌ను సంప్ర‌దించాడు.

S

Hyderabad | Published On Sep 20, 2026, 7.24 am IST

Hyderabad | శ్వాస‌నాళంలో ఇరుక్కున్న ‘విట‌మిన్ బీ’ మాత్ర‌.. తొల‌గించిన వైద్యులు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : ఓ 75 ఏళ్ల వృద్ధుడు గ‌త కొద్ది రోజుల నుంచి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నాడు. ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉండ‌డంతో చేసేదేమీ లేక చివ‌ర‌కు నాన‌క్‌రాంగూడ‌లోని స్టార్ హాస్పిట‌ల్ వైద్యుల‌ను సంప్ర‌దించాడు. వైద్యులు సీటీ స్కాన్ నిర్వ‌హించ‌గా, శ్వాస‌నాళంలో విట‌మిన్ బీ మాత్ర ఇరుక్కున్న‌ట్లు గుర్తించారు.

ప‌ల్మ‌నాల‌జిస్ట్ పెద్ది శ్రీకాంత్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైద‌రాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు ఇటీవ‌ల శ్వాస స‌మ‌స్య‌, ద‌గ్గు, ఛాతీలో అసౌక‌ర్యం ఉంద‌ని ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. ఛాతీ సీటీ స్కాన్‌ చేయగా ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే ప్రధాన శ్వాసనాళంలో కవచంతో సహా బీ కాంప్లెక్స్‌ మాత్ర ఉన్నట్లు గుర్తించారు. బాధితుడు తీవ్ర సీవోపీడీ సమస్య, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గి ఇబ్బంది పడుతుండటంతో.. మొదట యాంటీబయోటిక్స్, ఇతర మందులతో ఆయన ఆరోగ్యం కుదుట పడేలా చేశారు. అనంతరం బ్రాంకో స్కోపీ నిర్వహించి మాత్రను విజయవంతంగా తొలగించారు. ప్ర‌స్తుతం బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

 

Advertisement
Advertisement